చలో ఇంద్రవెల్లి సభకు కావేటి సబితా మనోహర్ ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్
సూర్య బెజ్జుర్ : ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు చలో ఇంద్రవెల్లి నినాదంతో టీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కావేటి సబితా మనోహర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. నియోజకవర్గంలోని బెజ్జుర్, చింతల మానేపల్లి, కౌటాల, సిర్పూర్, పెంచికల్ పేట్, దహెగాం, కాగజ్ నగర్,వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.మరోవైపు సిర్పూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని, అభివృద్ధి శూన్యంగా మారిందని పలువురు ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు చొరవ చూపడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారులు, విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు వంటి మౌలిక సమస్యలపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.