BREAKING
శివమాలలో 30 మంది భక్తులు-మహారాష్ట్రలోని ఘృష్ణశ్వరుడు వద్ద స్వామి దర్శనం-12వ జ్యోతిర్లింగమైనఅక్కడే మాల విరమణ అంటున్న స్వాములు ఇంటర్ పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థుల దోపిడీని అరికట్టాలి.. పిడిఎస్యు నాయకులు డిమాండ్ చలో ఇంద్రవెల్లి సభకు కావేటి సబితా మనోహర్ ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్ బాలికలకు పోక్సో, సైబర్ నేరాలపై అవగాహన మున్సిపాలిటీ ఎన్నికల దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు. నూతన రేషన్ షాప్ ను ప్రారంభించిన సీనియర్ తెదేపా నాయకులు భార్గవ్ రామ్ నాయుడు దళారుల ప్రమేయం లేకుండా రైతులకు మద్దతు ధర అందించాలి పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ తిరుపతి మేయర్ గా జేబీ శ్రీనివాస్ కార్పొరేటర్ గా పృద్విరెడ్డి భారీ మెజారిటీతో గెలుపు తధ్యం............ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యం వీవర్స్ కాలనీలో వైసిపి నాయకులు ఎన్నికల ప్రచారం.. భారతీయ సంస్కృతికి కట్టుబొట్టు అద్దం పట్టేలా రామరాజ్ కాటన్............. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలంగాణ రక్షణ సేన (TRS) దళిత వింగ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా చంటి శ్రీనివాస్ నియామకం పుట్టపర్తిలో కూటమి అభ్యర్థిని గెలిపించండి తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం ఎన్నికల కోఆర్డినేటర్‌గా జెల్లోజి శ్రీనివాస్ పటేల్ నియామకం

బ్యాంక్ ఖాతాదారులందరూ తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి ..

Select Suryaa Now
బ్యాంక్ ఖాతాదారులందరూ తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి ..

బ్యాంక్ ఖాతాదారులందరూ తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి ...

- టిజిబి మేనేజర్ ప్రవీణ్...

బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతి ఒక ఖాతాదారుడు తమ కేవైసీ (నో యువర్ కస్టమర్) వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న బ్యాంక్ సామాజిక భద్రత పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీబి అన్నపురెడ్డిపల్లి బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, సుకన్య సమృద్ధి పథకం, అటల్ పెన్షన్ యోజన పథకాలపై అవగాహన కల్పించారు. ఉపాధి హామీ పనులు, ఆసరా పింఛన్దారులు  ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతాను కేవైసీ అప్డేట్ చేయించుకోవాలని, కేవైసీ చేయని ఖాతాలను తాత్కాలంగా నిలిపివేసే అవకాశం ఉందని, కేవైసీ చేయించుకోకపోతే డబ్బులు  లావాదేవీలు నిలిచిపోవడం,  యూపీఐ, ఎటిఎం సేవలో అంతరాయం కలుగుతుందని బ్యాంక్ మేనేజర్ తెలిపారు. ఖాతాదారులందరు వెంటనే స్పందించి కేవైసీ ని పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లాకావత్ లక్ష్మి, ఉప సర్పంచ్ మారగాని అశోక్, సిఎఫ్ఎల్ కౌన్సిలర్ ప్రమీల, బ్యాంకు మిత్ర పూడూరి లక్ష్మి, బ్యాంక్ సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.