బాలికలకు పోక్సో, సైబర్ నేరాలపై అవగాహన
సూర్యరాజంపేట::రాజంపేట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం సురక్ష బటన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి. నాగరాణి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులకు పోక్సో చట్టం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. బాలికలు తమ హక్కులు, రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ శ్రీవాణి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.