భారతీయ సంస్కృతికి కట్టుబొట్టు అద్దం పట్టేలా రామరాజ్ కాటన్............. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
తిరుపతి
తిరుపతి నగరంలో రామ్ రాజ్ కాటన్ షోరూమ్ ను తుడా చైర్మన్ తిరుపతి జిల్లా పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి టిటిడి ఎక్స్ అఫీషియో సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రారంభించారు.వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఇతర విశిష్ట అతిథులతో కలిసి ఆయన రిబ్బన్ కట్ చేసి షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి తొలి కొనుగోలు చేసి అమ్మకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక నగరంలో సంప్రదాయ వస్త్రాలకు ఇది సరికొత్త చిరునామా రామ్ రాజ్ కాటన్ అని అన్నారు.భారతీయ సంస్కృతి, సంప్రదాయ దుస్తులకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ వస్త్ర సంస్థ రామరాజ్ కాటన్ నూతన షోరూంను తిరుపతి నగరంలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.తిరుపతి మున్సిపల్ ఆఫీసు సమీపంలో ప్రజలకు అందుబాటులో షోరూం ప్రారంభించినట్లు తెలిపారు.భారతీయ సంస్కృతి, కట్టు-బొట్టుకు అద్దం పట్టేలా అత్యంత నాణ్యమైన కాటన్ వస్త్రాలను అందిస్తున్న రామరాజ్ కాటన్ సంస్థ తిరుపతిలో తమ నూతన షోరూంను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం అని అన్నారు.నిత్యం వేలాది మంది భక్తులు తరలివచ్చే ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో సంప్రదాయ పంచెలు, ధోతీలు, కాటన్ షర్టులు, కుర్తాలు చిన్నారుల దుస్తులు ఒకే వేదికపై అందుబాటులోకి రావడం నగర ప్రజలకు, శ్రీవారి భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తితిదే బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి, స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ జి. జగదీష్, రామరాజ్ కాటన్ ప్రతినిధులు, షోరూం నిర్వాహకులు, సిబ్బంది, స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు పుర ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.