పుట్టపర్తిలో కూటమి అభ్యర్థిని గెలిపించండి
అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థి గెలవాలి... ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి పట్టణంతోపాటు సమీప ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే కూటమి అభ్యర్థి తప్పకుండా గెలవాలని ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా చివరి రోజు అయిన శుక్రవారం పుట్టపర్తి పట్టణంలో కూటమి నేతలు ర్యాలీ నిర్వహించారు. సత్యమ్మ కూడలిలో జరిగిన సభలో ఎమ్మెల్యే పల్లె సింధూర మాట్లాడుతూ కూటమి నేతల నిర్ణయం మేరకు ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి మున్సిపాలిటీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా మేకల ఈశ్వర్ బరిలో ఉన్నారని, తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కూటమి అభ్యర్థి విజయానికి కష్టపడి పనిచేయాలని సూచించారు. పుట్టపర్తి మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి తాము చైర్మన్ కు సహకారం అందిస్తామన్నారు.