BREAKING
విద్యార్థులతో మమేకమైన జడ్పీ సీఈఓ నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రంగంలోకి అళ హరి విజయ్ కుమార్ పిరంపల్లిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగుపై రైతులకు సూచనలు ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలి* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఎస్సీ సెల్ టౌన్ కమిటీ ఎన్నిక స్థానిక ఎన్నికల్లో హవా చాటుతున్న ఎమ్మెల్యే కాకర్ల పోలీసుల విధులపై విద్యార్థులకు అవగాహన క్రీడల్లోనూ అల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ రాజన్న సిరిసిల్ల PRGTA నూతన బాడీకి కలెక్టర్ శుభాకాంక్షలు రూరల్ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయే రైతులు, రైతు కూలీలను ఆదుకోవాలి మణుగూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో.. మెగా రక్తదాన శిబిరం శివమాలలో 30 మంది భక్తులు-మహారాష్ట్రలోని ఘృష్ణశ్వరుడు వద్ద స్వామి దర్శనం-12వ జ్యోతిర్లింగమైనఅక్కడే మాల విరమణ అంటున్న స్వాములు ఇంటర్ పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థుల దోపిడీని అరికట్టాలి.. పిడిఎస్యు నాయకులు డిమాండ్

దళారుల ప్రమేయం లేకుండా రైతులకు మద్దతు ధర అందించాలి

Select Suryaa Now
దళారుల ప్రమేయం లేకుండా రైతులకు మద్దతు ధర అందించాలి

దళారుల ప్రమేయం లేకుండా రైతులకు మద్దతు ధర అందించాలి

-గుర్రాలగొందిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

-సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్

 

 

సిద్దిపేట రూరల్ : రైతులు పండించిన ధాన్యాన్ని దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని గుర్రాలగొంది గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్ అన్నారు. శుక్రవారం నారాయణ రావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీఎం చంద్రంతో కలిసి ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని కోరారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కొనుగోళ్లు సజావుగా జరిగేలా గ్రామ పంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కృష్ణ, వార్డు సభ్యులు రాజు, సుజాత, విజయ, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, సీసీ హేమలత, ఐకేపీ సిబ్బంది, రైతులు, గ్రామ పెద్దలు, యువకులు, హమాలీ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

(సూర్య రూరల్, రమేష్)