తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం ఎన్నికల కోఆర్డినేటర్‌గా జెల్లోజి శ్రీనివాస్ పటేల్ నియామకం
సూర్య కరీంనగర్: తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం ఎన్నికల కోఆర్డినేటర్‌గా జెల్లోజి శ్రీనివాస్ పటేల్ నియమితులయ్యారు. కరీంనగర్‌లోని రాగా హోటల్‌లో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ అధ్యక్షతన నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఈ నియామకాన్ని ప్రకటించారు. నవంబర్‌లో నిర్వహించనున్న రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జెల్లోజి శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ, రానున్న సంఘం ఎన్నికల్లో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కుల సంఘంలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించి, ఎన్నికల ప్రక్రియలో అందరూ భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు.సంఘం అభివృద్ధికి, ఐక్యతకు తన వంతు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.