BREAKING
ఇంటర్ పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థుల దోపిడీని అరికట్టాలి.. పిడిఎస్యు నాయకులు డిమాండ్ చలో ఇంద్రవెల్లి సభకు కావేటి సబితా మనోహర్ ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్ బాలికలకు పోక్సో, సైబర్ నేరాలపై అవగాహన మున్సిపాలిటీ ఎన్నికల దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు. నూతన రేషన్ షాప్ ను ప్రారంభించిన సీనియర్ తెదేపా నాయకులు భార్గవ్ రామ్ నాయుడు దళారుల ప్రమేయం లేకుండా రైతులకు మద్దతు ధర అందించాలి పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ తిరుపతి మేయర్ గా జేబీ శ్రీనివాస్ కార్పొరేటర్ గా పృద్విరెడ్డి భారీ మెజారిటీతో గెలుపు తధ్యం............ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యం వీవర్స్ కాలనీలో వైసిపి నాయకులు ఎన్నికల ప్రచారం.. భారతీయ సంస్కృతికి కట్టుబొట్టు అద్దం పట్టేలా రామరాజ్ కాటన్............. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలంగాణ రక్షణ సేన (TRS) దళిత వింగ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా చంటి శ్రీనివాస్ నియామకం పుట్టపర్తిలో కూటమి అభ్యర్థిని గెలిపించండి తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం ఎన్నికల కోఆర్డినేటర్‌గా జెల్లోజి శ్రీనివాస్ పటేల్ నియామకం అవతారపురుషుడా.. రాజకీయ ప్రతీకా? పరశురాముడి పురాణం వెనుక మరో కోణం

ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణే లక్ష్యం.... జిల్లా ఎస్పీ ఎస్ .సతీష్ కుమార్

Select Suryaa Now
ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణే లక్ష్యం....  జిల్లా ఎస్పీ ఎస్ .సతీష్ కుమార్

హిందూపురం: - శ్రీ సత్యసాయి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ  ఎస్. సతీష్ కుమార్ తెలిపారు.నవంబర్ 1వ తేదీ ఆదివారం జిల్లాలోని పుట్టపర్తి, హిందూపురం, కదిరి, పెనుకొండ, మడకశిర, ధర్మవరం మున్సిపాలిటీల పరిధిలో జరగనున్న పోలింగ్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ఎన్నికల భద్రతా విధుల కోసం సుమారు 1,500 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు ఎస్పీ  వివరించారు. పోలింగ్ కేంద్రాలను సాధారణ, సమస్యాత్మక (సెన్సిటివ్), అత్యంత సమస్యాత్మక (హైపర్ సెన్సిటివ్) కేంద్రాలుగా గుర్తించి, ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.సివిల్ పోలీసులతో పాటు ఏఆర్, స్పెషల్ పార్టీలు, ఏపీఎస్పీ బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు.శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక పోలీసు బృందాలు, రూట్ మొబైల్స్, 61 స్ట్రైకింగ్ ఫోర్సులతో నిరంతర గస్తీ, పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులను సైతం సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.ఎన్నికల నియమావళి అమలులో 
(బి ఎన్ ఎస్ ఎస్ )సెక్షన్ 163 పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉన్న నిబంధనలతో  పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, ప్రతి పోలింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను మోహరించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.బయటి వ్యక్తుల అక్రమ ప్రవేశాన్ని అరికట్టడంతో పాటు అక్రమ నగదు, మద్యం రవాణాను నియంత్రించేందుకు సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.అల్లర్లు సృష్టించినా, ఎన్నికలకు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు..ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, ఘర్షణలు లేదా అల్లర్లకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.ప్రజలు, ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలు లేదా ఎన్నికల అక్రమాలు ఏవైనా దృష్టికి వస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లా పోలీసులకు సహకరించాలని ఎస్పీ  కోరారు.

హిందూపురం సూర్య స్టాఫ్ రిపోర్టర్ నాగేంద్ర