ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి.. డీఎస్పీ రవిబాబు..
హిందూపురం: - స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ఆ దేశాల మేరకు శుక్రవారం డీఎస్పీ రవిబాబు, సిఐ జనార్ధన్,చిలమత్తూరు ఎస్ఐ శ్రీధర్, పోలీసు సిబ్బందితో కలిసి చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులోడు, ఆరేమకలపల్లి, తుమ్మలకుంట గ్రామాల్లో మార్చ్‌పాస్ట్ నిర్వహించారు.ఈ సందర్భంగా డి.ఎస్.పి , సీఐ , ఎస్సై పోలీస్ సిబ్బందితో కలిసి గ్రామాల్లోని రౌడీషీటర్ల కదలికలను పరిశీలించి, పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి స్థానిక ప్రజలతో మాట్లాడి ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు, ఎన్నికలకు సంబంధించిన సమస్యలు, శాంతిభద్రతల అంశాలపై ఆరా తీశారు.ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతిభద్రతలను కాపాడాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ నిరంతరం పర్యవేక్షిస్తుందని డి.ఎస్.పి తెలిపారు.
హిందూపురం సూర్య స్టాప్ రిపోర్టర్ నాగేంద్ర