BREAKING
భారత మహిళా క్రికెట్‌కు అరుదైన ఘనత... యాభై ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసిన బీసీసీఐ! పంజాబ్ ఎన్నికల వేడి: ఆప్ తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల.. చరిత్ర సృష్టించిన ఐరిష్ బౌలర్... వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డు నమోదు చేసిన జై మూంద్ర! ర్యాపిడో డెలివరీ బాయ్ హస్తలాఘవం: రూ.62 వేల బంగారు నగలతో పరారీ! సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ... యూఏఈ చేతిలో ఘోర ఓటమి! మానకొండూరులో ఘనంగా రేమిడి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ జిల్లా స్థాయి ఎంపికలు హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో విధ్వంసం... శ్రీలంకపై సంచలన విజయం సాధించిన స్కాట్లాండ్! నియోజకవర్గ స్థాయి మాక్ అసెంబ్లీకి ముగ్గురు విద్యార్థులు ఎంపిక. టెస్టు క్రికెట్‌లో అరుదైన మైలురాయి... వంద వికెట్ల క్లబ్‌లో చేరిన వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్! భారత్ ఏ జట్టు కెప్టెన్ ధ్రువ్ జురెల్ అద్భుత పోరాటం... ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్! న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు కీలక మార్పు... భారత జట్టులోకి యువ పేసర్ ఆకిబ్ నబీ ఎంట్రీ! చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్‌గా మహేందర్ నందారి నియామకం టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డు... ఆసీస్‌పై లోయర్ ఆర్డర్‌లో సెంచరీలతో చెలరేగిన సౌతాఫ్రికా బ్యాటర్లు!

డా.సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. - నాగర్ కర్నూల్ జిల్లా అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు

Select Suryaa Now
డా.సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. - నాగర్ కర్నూల్  జిల్లా అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు

 భారతదేశపు తొలి ఉప ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి, ఉక్కుమనిషి డాక్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్  ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా అదనపు ఎస్పి నోముల వెంకటేశ్వర్లు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి (రాష్ట్రీయ ఏకతా దివస్) వేడుకలు శనివారం నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.​ఈ సందర్భంగా జిల్లా అదనపు పోలీసు ఎస్పీ సర్దార్ వల్లభాయ్ పటేల్  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కార్యాలయ సిబ్బందితో రాష్ట్రీయ ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేయించారు.స్వాతంత్ర్యానంతరం 500కి పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి, జాతికి ఒకే సార్వభౌమా ధికారాన్ని ప్రసాదించి అఖండ భారతాన్ని నిర్మించిన మహానాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. ఆయన చూపిన ధైర్యం, రాజనీతిజ్ఞత, పరిపాలనా దూరదృష్టి ప్రతీ భారతీయుడికి మార్గదర్శకాలనీ, దేశ సమగ్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వర్తించే పోలీస్ వ్యవస్థకు పటేల్ జీవన ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకమన్నారు.ఆయన ఆశయాలకు అనుగుణంగా సమాజంలో ఐక్యతను, భద్రతను కాపాడేందుకు పోలీసు సిబ్బంది అంకితభావంతో పనిచేయాలన్నారు.కార్యక్రమంలో  డిఎస్పి బుర్రి శ్రీనివాస్,ఏవో కృష్ణయ్య, ఆర్ఐ జగన్, ఆర్ ఎస్సైలు ప్రశాంత్, గౌస్ పాషా,శివాజీ లతోపాటు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పి.వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్ , సూర్య న్యూస్