సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ
సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో ఖాళీగా ఉన్న నాలుగు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీర్‌పూర్, మెట్‌పల్లిలోని బాలుర గురుకుల పాఠశాలలో విధులు నిర్వహించాల్సి ఉంటుందని, నెలకు రూ.20,000 వేతనం చెల్లిస్తారన్నారు. ఈ పోస్టులకు సంబంధించిన నియామక కాలపరిమితి ఆరు నెలలు మాత్రమే ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా, సంబంధిత విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులతో నవంబర్ 1 నుంచి నవంబర్ 3వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు బాలుర జూనియర్ కళాశాల, జగిత్యాల జిల్లాలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా కోఆర్డినేటర్ చెరుకు సుస్మితను 9154102664 నంబర్‌లో లేదా mjpdmp456@gmail.com) ఈ-మెయిల్ ద్వారా సంప్రదించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సూచించారు.