BREAKING
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజాసేవ ముఖ్యం ఎన్నికల విధులు అత్యంత జాగ్రత్తతో నిర్వహించాలి నాన్న కోలగట్ల సేవలను గుర్తించి.. నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు చర్యలు చేపట్టాలి: ఎంపీడీవో అంజన్ రెడ్డి బద్వేల్ జర్నలిస్టు లకుఎలక్షన్ పాసులు మంజూరు మున్సిపల్ కమిషనర్ కృష్ణ . ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు... తెదేపా సీనియర్ నాయకులు వంగా గోవిందరావు మృతి పార్టీకి తీరని లోటు... ఎంఎల్ఏ " కోండ్రు " గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితుడు సిగిలి వెంకటేష్ పై పీడీ యాక్ట్.... * విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ * అదనపు ఎస్పీ (పరిపాలన) గా బాధ్యతలు చేపట్టిన పద్మలత వైఎస్ఆర్ కాంగ్రెస్ ను వీడి తెదేపా లోకి వలసలు ప్రజా తీర్పుతోనే నాయకత్వానికి గుర్తింపు: పోరెడ్డి టీ ఆర్ పి ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ-మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ బాలల రక్షణ పై అవగాహన కల్పించడమే సురక్షిత్ బచ్పన్ అభియాన్ లక్ష్యం - జిల్లా మెజిస్ట్రేట్. కూటమి ఎంపిక చేసిన జడ్పిటిసి ఎన్నికల్లో రేవతి దే విజయం విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వోల్లాల లచ్చన్న కన్నుమూత

రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి నిందితుడిపై కఠిన చర్యలకు డిమాండ్

Select Suryaa Now
రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి నిందితుడిపై కఠిన చర్యలకు డిమాండ్

ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి: ఎన్ హెచ్ ఆర్ ఏసి అండ్ ఎసి బ్యూరో ఆఫ్ ఇండియా డిమాండ్.

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని ఓ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని గోపిక లక్ష్మిపై జరిగిన దాడిని నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అండ్ యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆరికొండ ప్రతాప్ కుమార్ తీవ్రంగా ఖండించారు. చెట్ల కొమ్మలు కత్తిరించే యంత్రంతో తరగతి గదిలో ఉన్న విద్యార్థినిపై హేమంత్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన ఆందోళనకరమని పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. విద్యార్థినిపై దాడికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు తక్షణమే స్పందించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడిలో గాయపడిన విద్యార్థినికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు. పాఠశాలలు విద్యార్థులకు భద్రత కల్పించాల్సిన ప్రదేశాలని, అలాంటి చోట ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాసంస్థల వద్ద భద్రతను మరింత పటిష్టం చేయాలని, సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టాలని డాక్టర్ ఆరికొండ ప్రతాప్ కుమార్ కోరారు.

ఎ. ప్రతాప్ కుమార్ ప్రొద్దుటూరు అర్బన్ వైఎస్సార్ కడప జిల్లా