BREAKING
నాన్న కోలగట్ల సేవలను గుర్తించి.. నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు చర్యలు చేపట్టాలి: ఎంపీడీవో అంజన్ రెడ్డి బద్వేల్ జర్నలిస్టు లకుఎలక్షన్ పాసులు మంజూరు మున్సిపల్ కమిషనర్ కృష్ణ . ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు... తెదేపా సీనియర్ నాయకులు వంగా గోవిందరావు మృతి పార్టీకి తీరని లోటు... ఎంఎల్ఏ " కోండ్రు " గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితుడు సిగిలి వెంకటేష్ పై పీడీ యాక్ట్.... * విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ * అదనపు ఎస్పీ (పరిపాలన) గా బాధ్యతలు చేపట్టిన పద్మలత వైఎస్ఆర్ కాంగ్రెస్ ను వీడి తెదేపా లోకి వలసలు ప్రజా తీర్పుతోనే నాయకత్వానికి గుర్తింపు: పోరెడ్డి టీ ఆర్ పి ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ-మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ బాలల రక్షణ పై అవగాహన కల్పించడమే సురక్షిత్ బచ్పన్ అభియాన్ లక్ష్యం - జిల్లా మెజిస్ట్రేట్. కూటమి ఎంపిక చేసిన జడ్పిటిసి ఎన్నికల్లో రేవతి దే విజయం విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వోల్లాల లచ్చన్న కన్నుమూత ఐక్యత, క్రమశిక్షణ, దేశభక్తికి సజీవ స్ఫూర్తి వల్లభ్‌భాయ్ పటేల్ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలి: డాక్టర్ సుంకరి

ఎన్నికల విధులకై... సర్వ సన్నద్ధమై..!!

Select Suryaa Now
ఎన్నికల విధులకై... సర్వ సన్నద్ధమై..!!

ఒంగోలు, మేజర్‌న్యూస్‌ :

మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ నిర్వహణకు అవసరమైన సామగ్రితో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి సిబ్బంది తమ కేటాయించిన కేంద్రాలకు వెళ్లారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఒంగోలు కార్పొరేషన్ కు సంబంధించి శనివారం రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు, ఎస్పీ శ్రీ.వి.హర్షవర్ధన్ రాజు, జిల్లా ఎన్నికల పరిశీలకులు శ్రీమతి కె.హెప్సిబా రాణి, వ్యయ పరిశీలకులు వివేక్ సందర్శించి ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించారు. ఎన్నికల విధులకు హాజరైన సిబ్బంది పోలింగ్ కేంద్రాల వారీగా తమకు కేటాయించిన సామగ్రిని తనిఖీ చేసుకున్నారు. భోజనం అనంతరం తమకు కేటాయించిన వాహనాలలో గట్టి భద్రత మధ్య పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. విధుల నిర్వహణకు అవసరమైన సూచనలు చేసి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వారికి చెప్పారు. ఎన్నికల సంఘ నిబంధనల మేరకు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితిని మైక్రో అబ్జర్వర్లు నిరంతరం నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ చెప్పారు.