BREAKING
ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్ బొబ్బిలి మాజీఎమ్మెల్యే. .చంబంగివెంకట చిన్నప్ప నాయుడు పోలింగ్ లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలి : జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్..* శ్రీధర్ గాదె కొత్త సినిమా 'కొరివి' టైటిల్ గ్లింప్స్ విడుదల: ఈశ్వర్ రాచిరాజు హీరోగా విలేజ్ బ్యాక్ డ్రాప్ హారర్ మూవీ కన్నడ నటి రన్యారావుకు వీఐపీ ప్రొటోకాల్ దర‍్శనం: తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు క్రైస్తవ సమాజంలో సంస్కరణలు రావాలి - పల్లె శాంతిరాజ్ లక్ష ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న చలమల్ల కృష్ణారెడ్డి పేదల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నది కూటమి ప్రభుత్వమే. అట్టహాసంగా ముగిసిన 'మోహన మంత్ర'! విద్యార్థుల మేధస్సుకు పట్టం కట్టిన టెక్నో-కల్చరల్ ఫెస్ట్. అంగన్‌వాడి కేంద్రంలో పాము కలకలం.. కరువు మండలాలుగా ప్రకటించాలని కలెక్టర్ కు వినతి - మాజీ ఎమ్మెల్యే గడ్డి గారి విట్టల్ రెడ్డి. ### పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తున్న వారిని బర్తరఫ్ చేయాలి జనసేన మండల అధ్యక్షుడు అడపా నాగరాజుపై పార్టీ నాయకుల తీవ్ర ఆరోపణలు బొర్రంపాలెం సమావేశంలో పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ బంగ్లాదేశ్‌లో విజృంభిస్తోన్న డెంగ్యూ మహమ్మారి టిజిపిసిబిలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు తైపీ మేయర్‌కు ఘోర అవమానం.. ప్రైడ్ పరేడ్‌లో నిరసనల హోరు మళ్లీ ఆదరిస్తే శంబర మరింత అభివృద్ధి

జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలి: డాక్టర్ సుంకరి

Select Suryaa Now
జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలి: డాక్టర్ సుంకరి

గుర్ల, సూర్య : గుర్ల మండల తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి చనమల రాధా, ఎంపీటీసీ అభ్యర్థి వల్లూరి భానుమతిని మెజారిటీతో గెలిపించే బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపకులు,టీడీపీ సీనియర్ నేత సుంకరి రామరమణమూర్తి పేర్కొన్నారు.శుక్రవారం పాలవలస గ్రామంలో టీడీపీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు.రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని అన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కళా వెంకట్రావు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.   మండల పార్టీ అధ్యక్షులు చనమల్ల మహేష్ మాట్లాడుతూ మండలంలోని గ్రామస్థాయి పార్టీ నాయకులు ,కార్యకర్తలంతా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని, పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చనమల్ల మహేష్, గ్రామ పెద్దలు వల్లూరి భాస్కరరావు, గేదెల అప్పలనాయుడు, పొట్నూరు అప్పలనాయుడు,సుంకరి పైడినాయుడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.