*మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి.... *ప్రతీ డివిజన్ అభివృద్ధి చేస్తా*
విజయనగరం బ్యూరో, సూర్య : విజయనగర ప్రజలు తనను తమ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి, ఆదివారం జరిగబోయే ఎన్నికల పోలింగ్ లో తనకు ఓటు వేసి గెలిపించాలని టీడీపీ బలపరిచిన కూటమి మేయర్ అభ్యర్థిని అవనాపు భార్గవి అభ్యర్థించారు. మేయర్ గా గెలుపొందితే ప్రతీ డివిజన్ ను అభివృద్ధి చేస్తానన్నారు. ప్రతీ కుటుంబానికి సేవలు అందిస్తానని అన్నారు. తన మామయ్య స్వర్గీయ అవనాపు సూరిబాబు స్ఫూర్తిగా, తన భర్త విజయ్ బాబు ఆకాంక్షలకు తగ్గట్టుగా సామాజిక సేవలు అందిస్తానని తెలిపారు. శనివారం విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్న భార్గవి ఈ సందర్భంగా నగర సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం, మహిళల భద్రత, యువత, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రూపొందించిన ఎన్నికల ప్రణాళికను ప్రజలకు వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం సహకారంతో, ఎమ్మెల్యే అధితి గజపతి ఆశీస్సులతో విజయనగరం నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఇది మన విజయనగరం అని నినాదం ఇచ్చిన భార్గవి "స్వచ్ఛమైన విజయనగరం.. సురక్షితమైన విజయనగరం.. సమాన అవకాశాలతో కూడిన విజయనగరం నిర్మాణమే తన లక్ష్యం." గా పేర్కొన్నారు. ప్రజల ఆశయాలే తన ప్రణాళిక.. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రాధాన్యత అని.. నగర అభివృద్ధే తన ధ్యేయం అని ఓటర్లుకు చాటి చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో, సహకారంతో విజయనగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. శనివారం విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్న భార్గవి ఈ సందర్భంగా నగర సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం, మహిళల భద్రత, యువత, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రూపొందించిన ఎన్నికల ప్రణాళికను ప్రజలకు వివరించారు.
కూటమి మేయర్ అభ్యర్థిని అవనాపు భార్గవి ఎన్నికల మేనిఫెస్టో :
- ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు:- నగరంలోని ప్రతి ఇంటికీ నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి.
- 24 గంటల తాగునీటి సరఫరా లక్ష్యంగా నగరవ్యాప్తంగా పైప్లైన్ల ఆధునీకరణ నీటి సరఫరాలో లీకేజీల నివారణ, కొత్త వాటర్ స్టోరేజ్ ట్యాంకుల ఏర్పాటుకు చర్యలు.
- సమగ్ర మురుగునీటి నిర్వహణ- వర్షాకాలంలో రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా వర్షపు నీటి కాలువల ఆధునీకరణ- ప్రధాన మురుగు కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడం- నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు కృషి.
- గుంతలేని విజయనగరం - ప్రతి వార్డులో నాణ్యమైన రహదారుల నిర్మాణం- అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు.- ప్రతి వీధిలో వీధి దీపాల ఏర్పాటు, నిరంతర నిర్వహణ.
- స్వచ్ఛ విజయనగరం - ప్రతి ఇంటి నుంచి క్రమం తప్పకుండా చెత్త సేకరణ.- ఆధునిక వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ అమలు.- మార్కెట్లు, బస్టాండ్లలో మెరుగైన పారిశుధ్య వసతులు-
- మహిళల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్ల ఏర్పాటు, నిర్వహణ- ప్రతి వార్డులో ప్రత్యేక పారిశుధ్య కార్యాచరణ.\
- మహిళల భద్రత – మహిళల అభివృద్ధి - మహిళల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సహాయక కేంద్రాల ఏర్పాటు.\
- మహిళల భద్రత కోసం సీసీ కెమెరాల వ్యవస్థ విస్తరణ- మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక ప్రోత్సాహం.\
- మహిళల ఆర్థిక స్వావలంబనకు అవసరమైన సహకారం.
- యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు :- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు కృషి.- యువతకు ఉపాధి ఆధారిత శిక్షణ కార్యక్రమాలు.
- నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక ఉద్యోగ మేళాల నిర్వహణ.- స్టార్టప్‌లు, స్వయం ఉపాధి అవకాశాలకు ప్రోత్సాహం, అవసరమైన సహకారం.
- ఆరోగ్యవంతమైన విజయనగరం - పట్టణ ఆరోగ్య కేంద్రాలను మరింత బలోపేతం చేయడం- వృద్ధుల కోసం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి.- ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పార్కులు, వాకింగ్ ట్రాక్‌ల అభివృద్ధి.- ప్రజలకు మెరుగైన ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం.
- హరిత విజయనగరం.- ప్రతి వార్డులో పార్కుల అభివృద్ధి- నగరవ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు.- పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ
- భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన నగరాన్ని అందించడం.
- బీసీల సంక్షేమం – సామాజిక న్యాయం - బీసీ సామాజిక వర్గాలకు చెందిన సంప్రదాయ వృత్తిదారులకు ప్రోత్సాహం.- బీసీ వర్గాల అభ్యున్నతికి నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు కృషి.- కమ్యూనిటీ హాళ్ల అభివృద్ధి, మెరుగైన మౌలిక వసతుల కల్పన.- స్థానిక మార్కెట్లు, రైతు బజార్ల ఆధునీకరణ.- వీధి వ్యాపారులకు ప్రత్యేక వెండింగ్ జోన్ల ఏర్పాటు.- చిరు వ్యాపారులు, స్థానిక వాణిజ్య వర్గాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం.
- డిజిటల్ మున్సిపాలిటీ – ప్రజల వద్దకే పాలన :- ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్లైన్ ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వ్యవస్థ.- ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వాట్సాప్ హెల్ప్‌లైన్.- మున్సిపల్ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం.- ప్రతి నెలా ప్రత్యేకంగా ప్రజా దర్బార్ నిర్వహణ.
వార్డుల వారీగా సమస్యల గుర్తింపు, పరిష్కారానికి కార్యాచరణ.- ప్రజలతో ప్రత్యక్ష సమీక్షా సమావేశాల నిర్వహణ.