3 నుంచి మద్యం షాపులు మూసివేత
విజయనగరం, సూర్య : జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్‌కు 48 గంటల ముందుగా, అంటే నవంబర్ 3వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు లేదా పోలింగ్ ముగిసే సమయం వరకు సంబంధిత పోలింగ్ ప్రాంతాల పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని సెక్షన్ 225-A ప్రకారం ఈ ఆదేశాలను అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆదేశాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం లేదా ఉల్లంఘన జరిగినా తీవ్రంగా పరిగణిస్తామని కలెక్టర్ హెచ్చరించారు.