మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల సందడి
జంగారెడ్డిగూడెం, మేజర్ న్యూస్మండలంలోని గురవాయిగూడెంలోని ప్రసిద్ధ శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువుగా వెలసిన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ముఖమండపంలో అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. వివిధ సేవలు, కానుకల రూపంలో ఆలయానికి రూ.1,74,540 ఆదాయం సమకూరినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.వి. చందన తెలిపారు. అదేవిధంగా ఆలయ నిత్యాన్నదాన సత్రంలో సుమారు 2,873 మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
రిపోర్టర్ కెవి రమణారావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా,