కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం
నగరం, మేజర్ న్యూస్: స్థానిక శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాలలో శనివారం కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కళాశాల ప్రాంగణాన్ని శుభ్రపర్చారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరికృష్ణ, వైస్ ప్రిన్సిపల్ ఆర్. ప్రసన్నబాబు, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ బాబులు పాల్గొని విద్యార్థులను అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను తమ బాధ్యతగా భావించి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు.