పెనుబర్తిలో ప్రతి గడపకు చేరిన టీడీపీ ప్రచారం
నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ : నెల్లూరు రూరల్ మండలంలోని పెనుబర్తి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రతి గడపకు వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలుసుకుంటూ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి తనను ఆశీర్వదించాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆశీస్సులతో, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సూచనలు, సహకారంతో జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు.అలాగే కోటంరెడ్డి సోదరుల సహకారంతో నెల్లూరు రూరల్ మండలంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని, మండలాన్ని జిల్లాలోనే ఆదర్శ మోడల్ మండలంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అభ్యర్థి చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడు చెన్నారెడ్డి సురేందర్ రెడ్డి, పల్లం రెడ్డి రవీంద్ర రెడ్డి,పల్లం రెడ్డి భాస్కర్ రెడ్డి,పల్లం రెడ్డి సుమంత్ రెడ్డి కలివెలపాలెం గ్రామానికి చెందిన పామూరు కామయ్య,పోతన బోయిన భాస్కర్, రావుల మధుబాబు,గుండు బోయిన పోతయ్య, గుండుబోయిన వెంకయ్య,కాటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కాటంరెడ్డి వెంకట్రామిరెడ్డి వేలాదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.