BREAKING
ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విద్యుత్ సబ్‌స్టేషన్‌ పరిశీలించి, తుఫాను బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ ఓట్ బచావో – దేశ్ బచావో’ నిరసనకు కూన శ్రీశైలం గౌడ్ ఢిల్లీ పయనం* డైట్ లో ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవం. మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ భద్రత - 144 సెక్షన్ అమలు. ఐసీసీ టెస్టుర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ పీఠాన్ని కైవసం చేసుకున్న సౌతాఫ్రికా: ఆస్ట్రేలియాకు గట్టి షాక్‌ పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత కరువు – గోపిక లక్ష్మిపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఏఐఎస్ఎఫ్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి…ఇందిరాగాంధీ వర్ధంతి ట్రైసిరీస్ ఫైనల్: సెంచరీతో చెలరేగిన కమిందు మెండిస్.. పాకిస్థాన్ ముందు భారీ లక్ష్యం సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో వెస్టిండీస్ ఘనవిజయం: బ్రాండన్ కింగ్ అద్భుత ఇన్నింగ్స్ శ్రీదేవి థియేటర్ రోడ్డు విస్తరణ పనులను పర్యవేక్షించిన డిసి శ్రీనివాస్ 100 మంది జానపద కళాకారులతో 'ఎల్లమ్మ' టైటిల్ సాంగ్ చిత్రీకరణ: గ్రాండ్‌గా తెరకెక్కుతున్న ఆధ్యాత్మిక ఫోక్ మెలోడీ మియాపూర్ అభివృద్ధికి రూ.13.82 కోట్ల నిధులతో పలు కాలనీల్లో పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

సిద్దిపేటలో జువెనైల్ జస్టిస్ బోర్డు ప్రారంభం కోర్టు ప్రాంగణంలో మెడికల్ డిస్పెన్సరీ ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శరత్

Select Suryaa Now
సిద్దిపేటలో జువెనైల్ జస్టిస్ బోర్డు ప్రారంభం  కోర్టు ప్రాంగణంలో మెడికల్ డిస్పెన్సరీ ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శరత్

సిద్దిపేట, : న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు న్యాయ సేవల కోసం కోర్టులకు వచ్చే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శరత్ శనివారం సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని సంతోషిమాత ఆలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన జువెనైల్ జస్టిస్ బోర్డును ఆయన ప్రారంభించారు.అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, వివిధ న్యాయపరమైన పనుల నిమిత్తం కోర్టుకు వచ్చే ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మెడికల్ డిస్పెన్సరీని ప్రారంభించారు. అక్కడ కల్పించిన వైద్య సదుపాయాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.తదుపరి కోర్టు భవనంలోని మూడో అంతస్తులో ఉన్న కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా న్యాయశాఖ అధికారులతో నిర్వహించిన జ్యుడీషియల్ రివ్యూ సమావేశంలో జస్టిస్ కె. శరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయపరమైన అంశాలు, న్యాయస్థానాల పనితీరు, సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఘన స్వాగతం.. పోలీసుల గౌరవ వందనం

శనివారం ఉదయం కొమురవెల్లి మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకున్న జస్టిస్ కె. శరత్‌కు జిల్లా జడ్జి జి. సుదర్శన్, జిల్లా కలెక్టర్ కె. హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మీ పెరుమాళ్ పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు గౌరవ వందనం సమర్పించారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా అదనపు జడ్జి జయప్రసాద్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, అదనపు డీసీపీ కుషాల్కర్, బార్ అసోసియేషన్ సభ్యులు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్, న్యాయశాఖ, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.