BREAKING
మన పేగుల్లో కోట్లాది మంచి బ్యాక్టీరియా.. వాటిని సురక్షితంగా కాపాడుకోవడం ఎలా బాధిత కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చేయూత పొలమూరులో కూటమి అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఐదు చెడ్డ ఆహారపు అలవాట్లు ఇవే.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే – మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. చిర్ల జగ్గిరెడ్డి చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయం నుండి ఎన్నికల ప్రచారం. పెరవలి మండలంలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచార జోరు ఆర్నాబ్ తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం - ప్రజా సమస్యలను వివరిస్తూ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కాకరపర్రులో మీ మార్ట్‌ను ప్రారంభించిన తహసీల్దార్ కే. నిరంజన్ మోహన్‌లాల్ 'అతిమనోహరం' ఫస్ట్ సింగిల్ విడుదల.. ఎంజీ శ్రీకుమార్ కాంబో మళ్లీ రిపీట్ పుర పోరులో ఎన్డీఏ కూటమిదే విజయం పోగొట్టుకున్న మొబైల్ అందజేత

మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత

ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపడదాం 

అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మహబూబ్ బాష

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. నేడు జరగనున్న చిత్తూరు మున్సిపల్ ఎన్నికలకు వటిష్ట భద్రతను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు శాఖ సమిష్టిగా కృషి చేయాలని సిబ్బందికి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మహబూబ్ బాష దిశా నిర్దేశం చేశారు. శనివారం పోలీసు శిక్షణ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బందోబస్తుకు కేటాయించిన ఇబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఆదివారం జరిగే పోలింగ్ రోజున పోలీసు సిబ్బంది పాటించాల్సిన విధివిధానాలు వివరించారు. పోలింగ్ లొకేషన్ బందోబస్తు సిబ్బంది నుంచి మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, క్యూఆర్టి, స్పెషల్ స్ట్రైకింగ్ బృందాల వరకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏదైనా సమస్య తలెత్తే అవకాశం ఉంటే వెంటనే ఉన్నతాధికారులు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ వెంకటనారాయణ మాట్లాడుతూ పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని తెలిపారు.ఓటర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, క్యూలైన్ నిర్వహణ సక్రమంగా చేపట్టాలని సూచించారు. ప్రిసైడింగ్ అధికారి అనుమతి లేకుండా బందోబస్తు సిబ్బంది పోలింగ్ స్టేషన్లలోకి ప్రవేశించరాదని స్పష్టం చేశారు. ప్రజలు గుంపులుగా గుమిగూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఓటింగ్ యంత్రాలు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరుకునే వరకు పటిష్టమైన భద్రత కల్పించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఏ.ఆ. డి.ఎస్పి రామకృష్ణ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ లు, ఎస్.ఐ. లు సిబ్బంది పాల్గొన్నారు.