BREAKING
మన పేగుల్లో కోట్లాది మంచి బ్యాక్టీరియా.. వాటిని సురక్షితంగా కాపాడుకోవడం ఎలా బాధిత కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చేయూత పొలమూరులో కూటమి అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఐదు చెడ్డ ఆహారపు అలవాట్లు ఇవే.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే – మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. చిర్ల జగ్గిరెడ్డి చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయం నుండి ఎన్నికల ప్రచారం. పెరవలి మండలంలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచార జోరు ఆర్నాబ్ తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం - ప్రజా సమస్యలను వివరిస్తూ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కాకరపర్రులో మీ మార్ట్‌ను ప్రారంభించిన తహసీల్దార్ కే. నిరంజన్ మోహన్‌లాల్ 'అతిమనోహరం' ఫస్ట్ సింగిల్ విడుదల.. ఎంజీ శ్రీకుమార్ కాంబో మళ్లీ రిపీట్ పుర పోరులో ఎన్డీఏ కూటమిదే విజయం పోగొట్టుకున్న మొబైల్ అందజేత

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ..

Select Suryaa Now
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ..

అనంతపురం విద్య మేజర్ న్యూస్ :- సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని శనివారం  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల పి.ఎస్. హెచ్.ఎం. డెగావత్ రవీంద్రనాథ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం అనేక సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసి, దేశ ఐక్యతకు పునాది వేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని వివరించారు. దేశ సమగ్రత కోసం ఆయన చేసిన కృషి, ధైర్యసాహసాలు, అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. విద్యార్థులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఐక్యత, క్రమశిక్షణ, దేశభక్తి వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు. ఉపాధ్యాయురాలు సుభాషిణి భాయి ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత విశేషాలను వివరించారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో జాతీయ సమైక్యత, దేశభక్తి భావాలను పెంపొందించేందుకు కృషి చేశారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్