బాధిత కుటుంబానికి ఆర్థిక, నిత్యావసర వస్తువుల పంపిణీ
అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్:- నిత్యసురభి చారిటబుల్ ట్రస్ట్, పుట్టినిల్లు ఆశ్రమం ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి విద్యా మందిరం సహకారంతో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. భర్త అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న శ్రీమతి రేణుకకు ట్రస్ట్ చైర్‌పర్సన్ నిర్మల మురళి నగదు సహాయంతో పాటు రెండు నెలలకు సరిపడా 34 రకాల నిత్యావసర వస్తువులను అందజేశారు.
ఈ సందర్భంగా నిర్మల మురళి మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి ప్రతి ఒక్కరూ తమకు చేతనైన సహాయం అందించాలని, చిన్నప్పటి నుంచే పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యా మందిరం ఆచార్యులు, మాతాజీలు తదితరులు పాల్గొన్నారు.