బూదవాడ సెగ్మెంట్లో టీడీపీకి అత్యధిక మెజార్టీ యువనేత బేరి
మర్రిపాడు, మేజర్ న్యూస్: మర్రిపాడు మండలంలోని బూదవాడ సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ లభిస్తుందని ఆ పంచాయతీ టీడీపీ యువనేత మరియు మండల సీనియర్ నాయకులు బేరి సునీతాబ్రహ్మానందరెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఇప్పటికే ఎంపీటీసీ స్థానాన్ని ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నప్పటికీ జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సెగ్మెంట్ పరిధిలోని కృష్ణాపురం, బెడుసుపల్లి, తిమ్మాయిపాలెం తదితర గ్రామాల్లోని ఓటర్లు దేశం పార్టీకి పట్టం కట్టనున్నారని పేర్కొన్నారు. టిడిపి బలోపేతంగా ఉండటం వల్లనే ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైందని తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆశీస్సులతో బరిలోకి దిగిన అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలవడం సులభతరం అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామంలో టీడీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఒక్క బూదవాడ సెగ్మెంట్ లోనే కాకుండా మండలం మొత్తం మీద ఇదే పరిస్థితి నెలకొని ఉందని, కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయడమే కాకుండా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని తెలియజేశారు.