BREAKING
బాధిత కుటుంబానికి ఆర్థిక, నిత్యావసర వస్తువుల పంపిణీ మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత మద్దికెరలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఎన్నికల ప్రచారం ప్రజాస్వామ్యానికి ఓటే ప్రాణం.. ప్రతి ఒక్కరూ ఓటేయాలి సమాజ హితమే నా లక్ష్యం.: ఘనంగా ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ వర్మ పదవీ విరమణ వేడుక : పొదిచన్‌పల్లి తండా సమీపంలో పసికందు కలకలం సంగారెడ్డి టి ఆర్ ఏ అధ్యక్షుడిగా పుట్టి సాయిలు నియామకం తొండుపల్లి జాతీయ రహదారి 44పై ప్రజల ప్రాణాలతో చెలగాటమా? సిద్దిపేటలో జువెనైల్ జస్టిస్ బోర్డు ప్రారంభం కోర్టు ప్రాంగణంలో మెడికల్ డిస్పెన్సరీ ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శరత్ పెనుబర్తిలో ప్రతి గడపకు చేరిన టీడీపీ ప్రచారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ.. తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి నీటిని పొదుపు చేసుకోండి శెట్టూరు మండలం, కంబాలపల్లి గ్రామం లో కలకలం, గొల్ల వీరుపాక్షి పై కొడవలి తో డాడీ. నిజాన్ని నిర్బంధించలేకపోయారు.. న్యాయమే గెలిచింది విద్యుత్ షాక్‌తో యువ ఎలక్ట్రిషియన్ మృతి.

తలారి రంగయ్య పై తెలుగుదేశం పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిబుట్నా లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు.

Select Suryaa Now
తలారి రంగయ్య పై తెలుగుదేశం పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిబుట్నా లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు.

కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఎన్డీఏ కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి తిమ్మరాజు తనపై వైఎస్సార్‌సీపీ నేత తలారి రంగయ్య తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంటూ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన పౌరసత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఓటర్లను మభ్యపెట్టేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు అసత్య ప్రచారానికి దిగుతున్నారని కూటమి నేతలు మండిపడ్డారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం బుట్నా లక్ష్మి తిమ్మరాజు మీడియాతో మాట్లాడుతూ తనను శ్రీలంకకు చెందిన వ్యక్తిగా చిత్రీకరిస్తూ పౌరసత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై అక్టోబర్ 28న ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తనపై ఆరోపణలు చేస్తూ ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రచారం వల్ల తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను 1978లోనే కళ్యాణదుర్గం కోడలిగా ఈ ప్రాంతానికి వచ్చానని, ఇక్కడే కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తూ ముగ్గురు పిల్లలకు తల్లిగా ఉన్నానని తెలిపారు. తన పౌరసత్వాన్ని ప్రభుత్వ అధికారులే గుర్తించి వివిధ ప్రభుత్వ గుర్తింపు కార్డులు జారీ చేశారని వివరించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల అధికారులు తన నామినేషన్‌ను పరిశీలించి ఆమోదించారని, అనంతరం సైకిల్ గుర్తును కేటాయించారని పేర్కొన్నారు. అన్ని నిబంధనల ప్రకారం ఎన్నికల బరిలో నిలిచిన తనపై కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి రాజకీయ ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతోనే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను ఎదుర్కోవాల్సింది పోయి వ్యక్తిగత ఆరోపణలు, అసత్య ప్రచారాలతో ఓటర్లను ప్రభావితం చేయాలని చూడటం సరికాదన్నారు. తనపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై పోలీసులు విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రచారాలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.