BREAKING
బాధిత కుటుంబానికి ఆర్థిక, నిత్యావసర వస్తువుల పంపిణీ మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత మద్దికెరలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఎన్నికల ప్రచారం ప్రజాస్వామ్యానికి ఓటే ప్రాణం.. ప్రతి ఒక్కరూ ఓటేయాలి సమాజ హితమే నా లక్ష్యం.: ఘనంగా ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ వర్మ పదవీ విరమణ వేడుక : పొదిచన్‌పల్లి తండా సమీపంలో పసికందు కలకలం సంగారెడ్డి టి ఆర్ ఏ అధ్యక్షుడిగా పుట్టి సాయిలు నియామకం తొండుపల్లి జాతీయ రహదారి 44పై ప్రజల ప్రాణాలతో చెలగాటమా? సిద్దిపేటలో జువెనైల్ జస్టిస్ బోర్డు ప్రారంభం కోర్టు ప్రాంగణంలో మెడికల్ డిస్పెన్సరీ ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శరత్ పెనుబర్తిలో ప్రతి గడపకు చేరిన టీడీపీ ప్రచారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ.. తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి నీటిని పొదుపు చేసుకోండి శెట్టూరు మండలం, కంబాలపల్లి గ్రామం లో కలకలం, గొల్ల వీరుపాక్షి పై కొడవలి తో డాడీ. నిజాన్ని నిర్బంధించలేకపోయారు.. న్యాయమే గెలిచింది విద్యుత్ షాక్‌తో యువ ఎలక్ట్రిషియన్ మృతి.

ఎన్నికలు సజావుగా జరగడానికి ఆర్వోల సమగ్ర పర్యవేక్షణ అత్యంత కీలకం : జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

Select Suryaa Now
 ఎన్నికలు సజావుగా జరగడానికి ఆర్వోల సమగ్ర పర్యవేక్షణ అత్యంత కీలకం :  జిల్లా కలెక్టర్  పి.రాజాబాబు

ఒంగోలు, మేజర్‌న్యూస్‌ :

 ఎన్నికలు సజావుగా జరగడానికి ఆర్వోల సమగ్ర పర్యవేక్షణ అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్  పి.రాజాబాబు అన్నారు. జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించిన ఆర్వోలతో శనివారం ప్రకాశం భవనములో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తమ పరిధిలో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత ఆర్వోలపై ఉందన్నారు. ఆర్వోల హ్యాండ్ బుక్కుపై పూర్తి అవగాహన కలిగి ఉండటం ద్వారా ఎన్నికలను సమర్థంగా నిర్వహించవచ్చు అన్నారు. ఈ దిశగా అవగాహన పెంచుకోవడంతో పాటు తమ పరిధిలోని సిబ్బందికి కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆర్వోలదే అన్నారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ రూమ్ వద్ద పనిచేసే సిబ్బందికి అవగాహన కల్పించాలని చెప్పారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్, కౌంటింగ్ రోజున ఓటింగ్ సరళి, ఫలితాలను సత్వరమే వెల్లడించేందుకు, సంబంధిత వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.