*కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు శెట్టి సుధాకర్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘనంగా వర్ధంతి వేడుకలు*
కోహెడ మండల కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి మండల కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు శెట్టి సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి వేడుకలు ఉక్కు మహిళ, భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కోహెడ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్ మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత కోసం ఇందిరా గాంధీ చేసిన కృషిని, దేశం కోసం ఆమె చేసిన త్యాగాలను ఇందిరా గాంధీ చేసిన సేవలను అలాగే బడుగు బలహీనతల వర్గాలకు కొట్లాడిన మహిళఇందిరా గాంధీఅని పేర్కొన్నారు ఆమె చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలనీ కొనియాడారు. అలాగే ఇందిరా గాంధీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ పాలనను అందిస్తూ, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప అధ్యక్షులు మంద ధర్మయ్య, కొహెడ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ బోయినీ నిర్మలా జయరాజ్, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శులు గోరిట్యాల లక్ష్మణ్, ప్రతాప్ రెడ్డి, వైస్ చైర్మన్ భీమ్ రెడ్డి తిరుపతి రెడ్డి, సిద్దిపేట జిల్లా ఎస్ సి సెల్ ఉప అధ్యక్షులు చింత కింది శంకర్ అలాగే వివిధ గ్రామాల సర్పంచ్ లు గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా పూలతో నివాళులు అర్పించారు.