BREAKING
ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విద్యుత్ సబ్‌స్టేషన్‌ పరిశీలించి, తుఫాను బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ ఓట్ బచావో – దేశ్ బచావో’ నిరసనకు కూన శ్రీశైలం గౌడ్ ఢిల్లీ పయనం* డైట్ లో ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవం. మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ భద్రత - 144 సెక్షన్ అమలు. ఐసీసీ టెస్టుర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ పీఠాన్ని కైవసం చేసుకున్న సౌతాఫ్రికా: ఆస్ట్రేలియాకు గట్టి షాక్‌ పట్టభద్రుల ఓటరు నమోదుపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత కరువు – గోపిక లక్ష్మిపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఏఐఎస్ఎఫ్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి…ఇందిరాగాంధీ వర్ధంతి ట్రైసిరీస్ ఫైనల్: సెంచరీతో చెలరేగిన కమిందు మెండిస్.. పాకిస్థాన్ ముందు భారీ లక్ష్యం సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో వెస్టిండీస్ ఘనవిజయం: బ్రాండన్ కింగ్ అద్భుత ఇన్నింగ్స్ శ్రీదేవి థియేటర్ రోడ్డు విస్తరణ పనులను పర్యవేక్షించిన డిసి శ్రీనివాస్ 100 మంది జానపద కళాకారులతో 'ఎల్లమ్మ' టైటిల్ సాంగ్ చిత్రీకరణ: గ్రాండ్‌గా తెరకెక్కుతున్న ఆధ్యాత్మిక ఫోక్ మెలోడీ మియాపూర్ అభివృద్ధికి రూ.13.82 కోట్ల నిధులతో పలు కాలనీల్లో పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

అగ్రిస్టాక్‌తో వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకురావాలి.జిల్లా కలెక్టర్ కె. హైమావతి

Select Suryaa Now
అగ్రిస్టాక్‌తో వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకురావాలి.జిల్లా కలెక్టర్ కె. హైమావతి

సిద్దిపేట, :వ్యవసాయ రంగంలో పారదర్శకతను పెంపొందిస్తూ రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు అగ్రిస్టాక్ డేటాను పూర్తిస్థాయిలో వినియోగించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులకు సూచించారు.శనివారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ అధ్యక్షతన అగ్రిస్టాక్ డేటా సంతృప్త స్థాయి సాధన, వ్యవసాయ రంగంలో వినూత్న సాంకేతిక పరిజ్ఞాన వినియోగాలను గుర్తించడంపై వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రైతుల వివరాలు, భూముల రికార్డులు, డిజిటల్ క్రాప్ సర్వే వివరాలను సమగ్రంగా అనుసంధానం చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో పారదర్శకతను పెంపొందించడం, అర్హులైన రైతులకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందించడం, గ్రామస్థాయిలో సమర్థవంతమైన వ్యవసాయ ప్రణాళికలు రూపొందించడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.కలెక్టర్ మాట్లాడుతూ.. అగ్రిస్టాక్ విధానం ద్వారా రైతుల నమోదు, భూముల వివరాలు, పంటల సాగు సమాచారాన్ని ఒకే వేదికపై సమగ్రంగా అనుసంధానం చేయవచ్చని తెలిపారు. దీనివల్ల రైతులకు అందించే సేవల్లో వేగం, పారదర్శకత పెరగడంతో పాటు ప్రభుత్వ పథకాల అమలులో మరింత సమర్థత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న డిజిటల్ సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.

ఐదు ప్రధాన అంశాలపై ప్రత్యేక కార్యాచరణ

సమావేశంలో ప్రధానంగా ఐదు కీలక అంశాలపై చర్చించి కార్యాచరణ రూపొందించారు.

  1. భూముల రికార్డులు – రైతుల వివరాల సమగ్రత: రైతుల నమోదు, భూముల రికార్డులు, ఇతర వివరాలను సమన్వయం చేసి డేటాలో ఖచ్చితత్వం సాధించడం.
  2. ప్రభుత్వ పథకాలు – సేవల అందజేత: అర్హులైన రైతులకు ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సేవలు ఎలాంటి జాప్యం లేకుండా అందేలా చర్యలు తీసుకోవడం.
  3. పంటల సాగు ప్రణాళిక – వ్యవసాయ విస్తరణ సేవలు: గ్రామస్థాయిలో పంటల సాగు వివరాల ఆధారంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడం.
  4. పంటల పర్యవేక్షణ – నష్టాల అంచనా – బీమా: డిజిటల్ సమాచారంతో పంటల పరిస్థితిని పర్యవేక్షించడం, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను అంచనా వేయడం, పంటల బీమా సేవలను మెరుగుపరచడం.
  5. మార్కెటింగ్ – కొనుగోళ్లు – రవాణా: పంటల విక్రయాలు, కొనుగోళ్లు, రవాణా, పంట అనంతర నిర్వహణలో మెరుగైన విధానాలను అమలు చేయడం.

అగ్రిస్టాక్ డేటాను సమర్థవంతంగా వినియోగిస్తూ రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. వ్యవసాయ రంగంలో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కార్యాచరణను అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, జిల్లా కోఆపరేటివ్ అధికారి, ఎన్‌ఐసీ  అధికారులు తదితరులు పాల్గొన్నారు.