BREAKING
బాధిత కుటుంబానికి ఆర్థిక, నిత్యావసర వస్తువుల పంపిణీ మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత మద్దికెరలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఎన్నికల ప్రచారం ప్రజాస్వామ్యానికి ఓటే ప్రాణం.. ప్రతి ఒక్కరూ ఓటేయాలి సమాజ హితమే నా లక్ష్యం.: ఘనంగా ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ వర్మ పదవీ విరమణ వేడుక : పొదిచన్‌పల్లి తండా సమీపంలో పసికందు కలకలం సంగారెడ్డి టి ఆర్ ఏ అధ్యక్షుడిగా పుట్టి సాయిలు నియామకం తొండుపల్లి జాతీయ రహదారి 44పై ప్రజల ప్రాణాలతో చెలగాటమా? సిద్దిపేటలో జువెనైల్ జస్టిస్ బోర్డు ప్రారంభం కోర్టు ప్రాంగణంలో మెడికల్ డిస్పెన్సరీ ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శరత్ పెనుబర్తిలో ప్రతి గడపకు చేరిన టీడీపీ ప్రచారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ.. తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి నీటిని పొదుపు చేసుకోండి శెట్టూరు మండలం, కంబాలపల్లి గ్రామం లో కలకలం, గొల్ల వీరుపాక్షి పై కొడవలి తో డాడీ. నిజాన్ని నిర్బంధించలేకపోయారు.. న్యాయమే గెలిచింది విద్యుత్ షాక్‌తో యువ ఎలక్ట్రిషియన్ మృతి.

అభివృద్ధి చేస్తున్నాం.. ఆశీర్వదించండి - పల్లెపల్లెనా కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం

Select Suryaa Now
అభివృద్ధి చేస్తున్నాం.. ఆశీర్వదించండి - పల్లెపల్లెనా కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం

మనుబోలు,  మేజర్ న్యూస్ :  కూటమి అభ్యర్థుల విజయంతో అభివృద్ధి మరింత వేగవంతం   మనుబోలు మండలం  బద్దెవోలు, పిడూరుపాళెం, వెంకన్నపాళెంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  జెడ్పీటీసీ అభ్యర్థి పొట్టేళ్ల ప్రసాద్, బద్దెవోలు ఎంపీటీసీ సెగ్మెంట్ అభ్యర్థి గాలి శాంతిప్రియతో పాటు అన్ని ఎంపీటీసీ సెగ్మెంట్లలో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం

వైసీపీ పాలనలో నిధులను డైవర్ట్ చేసి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు.  కేంద్ర ఆర్థిక సంఘం నిధులను పడినవి పడినట్టుగా దారి మళ్లించి పల్లెల అభివృద్దిని విస్మరించారు.  ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్క రూపాయిని దారి మళ్లించకుండా పల్లెల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు.  ఆర్&బీ, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల పరిధిలోనూ భారీగా నిధులు తెస్తున్నాం  రూ.110 కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా త్రీఫేజ్ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసే ఆర్డీఎస్ఎస్ పనులు జోరుగా సాగుతున్నాయి  రూ.50 కోట్లకు పైగా నిధులతో దళితులు, గిరిజనుల ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నాం  సుమారు రూ.50 కోట్లకు పైగా నిధులతో ఇరిగేషన్ కాలువల వ్యవస్థకు పూర్వ వైభవం తెస్తున్నాం  రూ.4.50 కోట్లతో కొలనకుదురు రోడ్డు నిర్మాణం జరుగుతోంది   నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు..ఈ పనులన్నీ చేసి మీ రుణం తీర్చుకుంటున్నా  ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను కూడా ఆశీర్వదిస్తే గ్రామాల్లో అభివృద్ధి మరింత జోరుగా సాగుతుంది  సంక్షేమ పథకాల అమలులో కేంద్ర ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తోంది   దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా రూ.4 వేలు, రూ.6 వేలు, రూ.10 వేలు, రూ.15 వేలు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తున్నాం  తల్లికి వందనం పథకంలో భాగంగా ఒక ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అందరికీ ప్రయోజనం చేకూరుస్తున్న ఘనత నారా లోకేష్ బాబుకు దక్కుతుంది   ఆడపడుచులు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సాగిస్తున్నారు  దీపం పథకంలో భాగంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం  అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ సమ్మాన్ లో భాగంగా రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తున్నాం   సర్వేపల్లిలోని 5 జెడ్పీటీసీలు, 5 ఎంపీపీలను గెలిపించుకుని ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు సాధించుకుందాం