BREAKING
బాధిత కుటుంబానికి ఆర్థిక, నిత్యావసర వస్తువుల పంపిణీ మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత మద్దికెరలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఎన్నికల ప్రచారం ప్రజాస్వామ్యానికి ఓటే ప్రాణం.. ప్రతి ఒక్కరూ ఓటేయాలి సమాజ హితమే నా లక్ష్యం.: ఘనంగా ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ వర్మ పదవీ విరమణ వేడుక : పొదిచన్‌పల్లి తండా సమీపంలో పసికందు కలకలం సంగారెడ్డి టి ఆర్ ఏ అధ్యక్షుడిగా పుట్టి సాయిలు నియామకం తొండుపల్లి జాతీయ రహదారి 44పై ప్రజల ప్రాణాలతో చెలగాటమా? సిద్దిపేటలో జువెనైల్ జస్టిస్ బోర్డు ప్రారంభం కోర్టు ప్రాంగణంలో మెడికల్ డిస్పెన్సరీ ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శరత్ పెనుబర్తిలో ప్రతి గడపకు చేరిన టీడీపీ ప్రచారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ.. తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి నీటిని పొదుపు చేసుకోండి శెట్టూరు మండలం, కంబాలపల్లి గ్రామం లో కలకలం, గొల్ల వీరుపాక్షి పై కొడవలి తో డాడీ. నిజాన్ని నిర్బంధించలేకపోయారు.. న్యాయమే గెలిచింది విద్యుత్ షాక్‌తో యువ ఎలక్ట్రిషియన్ మృతి.

గడపగడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన బచ్చల సుమేధ, శ్రీ హనీత్ రెడ్డి

Select Suryaa Now
గడపగడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన బచ్చల సుమేధ, శ్రీ హనీత్ రెడ్డి

పొదలకూరు,  మేజర్ న్యూస్ :    సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా గడపగడపకూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొదలకూరు మండల వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి బచ్చల సురేష్ కుమార్ రెడ్డి సతీమణి బచ్చల సుమేధ, బచ్చల శ్రీ హనీత్ రెడ్డి, తాటిపర్తి బిట్‌-1 ఎంపీటీసీ అభ్యర్థి ఉయ్యాల ప్రతాప్ రెడ్డి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కులమతాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి కుటుంబానికీ సంక్షేమ ఫలాలు అందాయని పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి, పేదల సంక్షేమానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.

అభివృద్ధి, సంక్షేమమే వైఎస్సార్‌సీపీకి బలం

గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని, ప్రజలకు అందిన సంక్షేమాన్ని గుర్తుచేసుకుని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని బచ్చల సుమేధ కోరారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ప్రజల ఆశీస్సులతో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.తాటిపర్తి బిట్‌-1 ఎంపీటీసీ అభ్యర్థి ఉయ్యాల ప్రతాప్ రెడ్డిని, పొదలకూరు మండల జడ్పీటీసీ అభ్యర్థి బచ్చల సురేష్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.