కూటమి జడ్పిటిసి అభ్యర్థి, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి
--శివరం పంచాయతీ మహాలింగప్ప యాదవ్ పిలుపు
అమరాపురం మేజర్ న్యూస్ అక్టోబర్ 31: అమరాపురం జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శివ రుద్రప్పను మరియు హేమావతి పంచాయతీ ఎంపిటిసి 1 అభ్యర్థి జలజాక్షి జయ కుమార్, ఎంపీటీసీ 2 వనజ శివశంకర్, కోమావతి 3 అభ్యర్థి నారాయణ కె శివరం కూటమి ఎంపీటీసీ అభ్యర్థి ఈడిగ తిమ్మక్క వీరిని అలానే మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాల అభ్యర్థుల ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెదేపా సీనియర్ నాయకుడు కేశివరం గొల్లహాట్టి టీచర్ మహాలింగప్ప యాదవ్ మరియు కార్యకర్తలు ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో కూటమి శ్రేణులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల బలోపేతానికి, మండలం మరియు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం శ్రమించే వ్యక్తి శివ రుద్రప్ప అని కొనియాడారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉండి, అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిని గెలిపించుకోవడం ద్వారానే మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని టీచర్ మహాలింగప్ప యాదవ్ స్పష్టం చేశారు. అలానే ప్రజలు ఆశీర్వదించి జడ్పీటీసీగా గెలిపిస్తే.. మండలంలో తాగునీరు, సాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ప్రజాసేవ చేస్తారన్నారు. కూటమి సాధిస్తున్న విజయాలను ముందుకు తీసుకెళ్లేందుకు, రాబోయే నవంబరు 5న నిర్వహించే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి, అభ్యర్థులను అత్యధిక ఓట్ల మెజారిటీతో విజయతీరాలకు చేర్చాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.