ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సమక్షంలో టీడీపీలో చేరిన కొత్తపట్నం మండల అల్లూరు గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు
కొత్తపట్నం, మేజర్‌న్యూస్ :
కొత్తపట్నం మండల అల్లూరు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈరోజు మధ్యాహ్నం ఒంగోలు నగరంలోని శాసనసభ్యులు గారి నివాసంలో ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అల్లూరు చెందిన వైసీపీ నాయకులు సన్నిగిరి వెంకటస్వామి, లింగంగుంట పెరయ్య మరియు మిట్నెసల శత్రుజ్ఞ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య, గ్యానం సుబ్బారావు, నాలం నరసమ్మ, Dr -విజయ రాఘవరావు, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి ,శ్యాంబాబు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.