BREAKING
ప్రచారంలోదూసుకుపోతున్న వున్నం వారి కోడలు జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ దీపిక పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల జడ్పిటిసి అభ్యర్థి, వున్నం వారి కోడలు డా. వున్నం దీపిక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. శనివారం కరాలపాడు గ్రామంలో ఆమె నిర్వహించిన ప్రచారానికి విశేష స్పందన లభించింది. డప్పుల చప్ గడపగడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన బచ్చల సుమేధ, శ్రీ హనీత్ రెడ్డి సర్వేపల్లిలో వైఎస్సార్‌సీపీదే హవా - స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు మావే కాకాణి పూజిత 'రామాయణ'లో రావణుడి పాత్రపై రాకింగ్ స్టార్ యశ్ స్పందన: తన కుమారుడి ప్రశ్నలకు యశ్ ఇచ్చిన ఆసక్తికర సమాధానాలు ఎన్నికలు సజావుగా జరగడానికి ఆర్వోల సమగ్ర పర్యవేక్షణ అత్యంత కీలకం : జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు భట్టిప్రోలు 2 వ సెగ్మెంట్ ప్రచారంలో పాల్గొన్న తూనుగుంట్ల సాయిబాబా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సమక్షంలో టీడీపీలో చేరిన కొత్తపట్నం మండల అల్లూరు గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు బూదవాడ సెగ్మెంట్లో టీడీపీకి అత్యధిక మెజార్టీ యువనేత బేరి *కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు శెట్టి సుధాకర్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘనంగా వర్ధంతి వేడుకలు* కూటమి జడ్పిటిసి అభ్యర్థి, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం తలారి రంగయ్య పై తెలుగుదేశం పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిబుట్నా లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు. అభివృద్ధి చేస్తున్నాం.. ఆశీర్వదించండి - పల్లెపల్లెనా కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం కింగ్ నాగార్జున సమర్పణలో ‘ఇట్లు అర్జున’ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి జాతీయ అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలకు నగరం కళాశాల విద్యార్థుల ఎంపిక

తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి

Select Suryaa Now
తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి   : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :
దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్ 31 నాటికి వాయుగుండంగా బలపడి, అనంతరం ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలు వాతావరణ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి., శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

వాతావరణ శాఖ జారీ చేసే తాజా సూచనలు, హెచ్చరికలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనించాలని, అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కలెక్టర్ కోరారు. వర్షాలు, ఈదురుగాలులు వీచే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు, శిథిలావస్థలో ఉన్న భవనాల సమీపంలో ఉండరాదని సూచించారు.

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

రైతులు వ్యవసాయ పనుల విషయంలో వాతావరణ సూచనలను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు పాటించాలని,మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలో కి చేపల వేటకు వెళ్లిన వారు తీరానికి సురక్షితంగా చేరుకోవాలన్నారు.
లోతట్టు ప్రాంతాలు, నీరు నిలిచే ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,.
విద్యుత్ తీగలు తెగిపడిన చోట్లకు వెళ్లరాదని. విద్యుత్ ప్రమాదాలు సంభవించకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందుగానే తగిన జాగ్రత్త చేపట్టాలన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో పోలీసు, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల అధికారులను సంప్రదించాలని,
ప్రజలు తమ ఇళ్లలో తాగునీరు, అత్యవసర మందులు, టార్చ్‌లైట్లు, ఇతర నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు:

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. మండల స్థాయి అధికారులు, గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, వైద్య ఆరోగ్య, వ్యవసాయ, మత్స్యశాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు, పునరావాస కేంద్రాలు, తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీలను శుభ్రం చేయాలని, విద్యుత్ అంతరాయాలు, రహదారులపై చెట్లు పడిపోవడం వంటి సమస్యలు తలెత్తితే తక్షణమే స్పందించేలా సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించారు.
ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలు చేపడుతోందని, ప్రజలు అధికారులకు సహకరిస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.