ప్రచారంలోదూసుకుపోతున్న వున్నం వారి కోడలు జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ దీపిక పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల జడ్పిటిసి అభ్యర్థి, వున్నం వారి కోడలు డా. వున్నం దీపిక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. శనివారం కరాలపాడు గ్రామంలో ఆమె నిర్వహించిన ప్రచారానికి విశేష స్పందన లభించింది. డప్పుల చప్
ప్రచారంలోదూసుకుపోతున్న వున్నం వారి కోడలు జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ దీపిక
పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్
పిడుగురాళ్ల జడ్పిటిసి అభ్యర్థి, వున్నం వారి కోడలు డా. వున్నం దీపిక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. శనివారం కరాలపాడు గ్రామంలో ఆమె నిర్వహించిన ప్రచారానికి విశేష స్పందన లభించింది.
డప్పుల చప్పుళ్లు, డిజె సౌండ్ల నడుమ మహిళలు హారతులిస్తూ బ్రహ్మరథం పట్టగా, ప్రచార రథంపై గ్రామంలోని ప్రతి వీధిలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరును కలిసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా డా. దీపిక మాట్లాడుతూ "వైద్యురాలిగా నా పనితీరు భేష్ అని మీరే మెచ్చుకున్నారు. ఎంతో మందికి వైద్య సేవలు అందించాను. ఇప్పుడు రాజకీయ నాయకురాలిగా కూడా మీకు సేవ చేసేందుకు వచ్చాను. నా పనితీరు కూడా చూస్తారని, నాకు ఒక అవకాశం కల్పిస్తారని కోరుతున్నాను" అని అన్నారు.
వున్నం కుటుంబం గతంలో చేసిన సేవలను, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల