తహసీల్దార్ దగ్గర అనుమతి తీసుకుంటే చాలు --- ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్. మధుసూదన్
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నవంబర్ 5వ తేదీ జిల్లాలో జరిగే జడ్పిటిసి, ఎంపీటీసీ ఎలక్షన్స్ కు సంబంధించి అన్ని వెహికల్, మైక్, ఊరేగింపు, మీటింగ్స్ అనుమతులు ఆయా మండల తాహసిల్దార్ దగ్గర పొందవచ్చని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జడ్పీ సీఈఓ ఎస్. మధుసూదన్, డిప్యూటీ సీఈవో వై.బ్రహ్మయ్య శనివారం తెలిపారు. గతంలో ఆయా డివిజన్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి ఆర్డీవో, డి.ఎస్.పి దగ్గర అనుమతులు తీసుకునే వారన్నారు. ఈసారి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పూనేఠ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎన్నికల బరిలోని అభ్యర్థులు ఆయా డివిజన్ హెడ్ క్వాటర్స్ వరకూ వెళ్లే పని లేకుండా లోకల్ గా ఏ మండలానికి చెందిన వాళ్ళు ఆ మండలం తహసీల్దార్ దగ్గరే అనుమతి తీసుకోవచ్చని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆదేశించారని వారు తెలిపారు. జిల్లాలోని 30 జడ్పిటిసి స్థానాలకు 103 మంది , 362ఎంపీటీసీ స్థానాలకు887 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే.