పోలింగ్‌కు సర్వం సిద్ధం.. కేంద్రాలకు చేరుకుంటున్న ఎన్నికల సిబ్బంది!
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా శనివారం డీకేడబ్ల్యూ కళాశాల నుంచి ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రిని తీసుకుని సిబ్బంది ప్రత్యేకంగా కేటాయించిన కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికల సిబ్బంది తమ విధుల్లో నిమగ్నమవడంతో నగరంలో పోలింగ్ సందడి మొదలైంది.