BREAKING
గడపగడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన బచ్చల సుమేధ, శ్రీ హనీత్ రెడ్డి సర్వేపల్లిలో వైఎస్సార్‌సీపీదే హవా - స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు మావే కాకాణి పూజిత 'రామాయణ'లో రావణుడి పాత్రపై రాకింగ్ స్టార్ యశ్ స్పందన: తన కుమారుడి ప్రశ్నలకు యశ్ ఇచ్చిన ఆసక్తికర సమాధానాలు ఎన్నికలు సజావుగా జరగడానికి ఆర్వోల సమగ్ర పర్యవేక్షణ అత్యంత కీలకం : జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు భట్టిప్రోలు 2 వ సెగ్మెంట్ ప్రచారంలో పాల్గొన్న తూనుగుంట్ల సాయిబాబా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సమక్షంలో టీడీపీలో చేరిన కొత్తపట్నం మండల అల్లూరు గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు బూదవాడ సెగ్మెంట్లో టీడీపీకి అత్యధిక మెజార్టీ యువనేత బేరి *కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు శెట్టి సుధాకర్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘనంగా వర్ధంతి వేడుకలు* కూటమి జడ్పిటిసి అభ్యర్థి, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం తలారి రంగయ్య పై తెలుగుదేశం పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిబుట్నా లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు. అభివృద్ధి చేస్తున్నాం.. ఆశీర్వదించండి - పల్లెపల్లెనా కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం కింగ్ నాగార్జున సమర్పణలో ‘ఇట్లు అర్జున’ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి జాతీయ అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలకు నగరం కళాశాల విద్యార్థుల ఎంపిక పేదరిక రహిత దిశగా భారత్

నగర పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

Select Suryaa Now
నగర పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

పాలకొండ, సూర్య : నగర పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్లు ఆర్ ఓ, సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాద్ తెలిపారు. నవంబర్ 1వ తేదీ ఆదివారం ఉదయం 7.00 గంటలు నుంచే బ్యాలెట్ పత్రాల ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అన్నారు. పాలకొండ నగర పంచాయతీ పరిధిలో మొత్తం 23,466 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 11,453 మంది పురుషులు, 12,012 మంది మహిళలు, ఒకరు ఇతర ఓటరు ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం 28 వార్డులకు సంబంధించి 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారని, ఎన్నికల నిర్వహణ కోసం 59 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయడంతో పాటు 30 మంది ఎన్నికల అధికారులు (ఈఓలు), 30 సహాయ ఎన్నికల అధికారులు (ఏఈఓలు) నియమించినట్లు చెప్పారు. 6గురు ఏఈఓలను రిజర్వులో ఉంచారు. ఎన్నికల విధుల నిర్వహణ సజావుగా జరిగేందుకు మున్సిపాలిటీని 5 రూట్లు, 3 జోన్లుగా విభజించారని, మొత్తం 120 మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించగా, వీరిలో  ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది ఉన్నారన్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సర్వం సిద్దమైందని వివరించారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ పరిశీలన
పాలకొండ నగర పంచాయతీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఎన్నికల సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేశారు. ఎన్నికల అబ్జర్వర్ ఎస్.చిన్న రాముడు, సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ ఏర్పాట్లను పరిశీలించారు. బ్యాలెట్ బాక్సుల సీలింగ్, పోలింగ్ ప్రక్రియపై అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.