BREAKING
నాన్న కోలగట్ల సేవలను గుర్తించి.. నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు చర్యలు చేపట్టాలి: ఎంపీడీవో అంజన్ రెడ్డి బద్వేల్ జర్నలిస్టు లకుఎలక్షన్ పాసులు మంజూరు మున్సిపల్ కమిషనర్ కృష్ణ . ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు... తెదేపా సీనియర్ నాయకులు వంగా గోవిందరావు మృతి పార్టీకి తీరని లోటు... ఎంఎల్ఏ " కోండ్రు " గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితుడు సిగిలి వెంకటేష్ పై పీడీ యాక్ట్.... * విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ * అదనపు ఎస్పీ (పరిపాలన) గా బాధ్యతలు చేపట్టిన పద్మలత వైఎస్ఆర్ కాంగ్రెస్ ను వీడి తెదేపా లోకి వలసలు ప్రజా తీర్పుతోనే నాయకత్వానికి గుర్తింపు: పోరెడ్డి టీ ఆర్ పి ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ-మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ బాలల రక్షణ పై అవగాహన కల్పించడమే సురక్షిత్ బచ్పన్ అభియాన్ లక్ష్యం - జిల్లా మెజిస్ట్రేట్. కూటమి ఎంపిక చేసిన జడ్పిటిసి ఎన్నికల్లో రేవతి దే విజయం విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వోల్లాల లచ్చన్న కన్నుమూత ఐక్యత, క్రమశిక్షణ, దేశభక్తికి సజీవ స్ఫూర్తి వల్లభ్‌భాయ్ పటేల్ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలి: డాక్టర్ సుంకరి

పోగొట్టుకున్న ఫోన్‌ను బాధితుడికి అప్పగింత

Select Suryaa Now
పోగొట్టుకున్న ఫోన్‌ను బాధితుడికి అప్పగింత

నవాబుపేట సూర్య న్యూస్: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి బాధితుడికి అప్పగించినట్లు ఎస్సై నరేందర్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం..నవాబుపేట మండలం రేకులచౌడాపూర్ గ్రామానికి చెందిన కె.మనోహర్,2024 ఆగస్టు 25న గ్రామం నుంచి మహబూబ్‌నగర్‌కు ద్విచక్ర వాహనంపై కూలీ పనికి వెళ్తుండగా మార్గమధ్యలో తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు.సుమారు రూ.25వేల విలువైన ఫోన్ పోవడంతో వెంటనే నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.ఈ మేరకు పోలీసులు కేంద్ర పరికరాల గుర్తింపు నమోదు విధానం (సీఈఐఆర్)ద్వారా ఫోన్‌ను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.హైదరాబాద్‌లో ఫోన్‌ను గుర్తించి,శనివారం బాధితుడు మనోహర్‌కు తిరిగి అప్పగించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ..ఎవరైనా తమ మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నా,దొంగతనానికి గురైనా వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్ర పరికరాల గుర్తింపు నమోదు పోర్టల్‌లో ఫోన్ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.