BREAKING
నాన్న కోలగట్ల సేవలను గుర్తించి.. నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు చర్యలు చేపట్టాలి: ఎంపీడీవో అంజన్ రెడ్డి బద్వేల్ జర్నలిస్టు లకుఎలక్షన్ పాసులు మంజూరు మున్సిపల్ కమిషనర్ కృష్ణ . ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు... తెదేపా సీనియర్ నాయకులు వంగా గోవిందరావు మృతి పార్టీకి తీరని లోటు... ఎంఎల్ఏ " కోండ్రు " గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితుడు సిగిలి వెంకటేష్ పై పీడీ యాక్ట్.... * విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ * అదనపు ఎస్పీ (పరిపాలన) గా బాధ్యతలు చేపట్టిన పద్మలత వైఎస్ఆర్ కాంగ్రెస్ ను వీడి తెదేపా లోకి వలసలు ప్రజా తీర్పుతోనే నాయకత్వానికి గుర్తింపు: పోరెడ్డి టీ ఆర్ పి ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ-మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ బాలల రక్షణ పై అవగాహన కల్పించడమే సురక్షిత్ బచ్పన్ అభియాన్ లక్ష్యం - జిల్లా మెజిస్ట్రేట్. కూటమి ఎంపిక చేసిన జడ్పిటిసి ఎన్నికల్లో రేవతి దే విజయం విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వోల్లాల లచ్చన్న కన్నుమూత ఐక్యత, క్రమశిక్షణ, దేశభక్తికి సజీవ స్ఫూర్తి వల్లభ్‌భాయ్ పటేల్ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలి: డాక్టర్ సుంకరి

జాతీయ అవార్డు గ్రహీత. ఖాజా వలి కి ఘనంగా సత్కారం.

Select Suryaa Now
జాతీయ అవార్డు గ్రహీత. ఖాజా వలి కి ఘనంగా సత్కారం.

*గుంతకల్లు:** జాతీయ స్థాయిలో ఉత్తమ జర్నలిస్టుగా గుర్తింపు పొంది పురస్కారం అందుకున్న సూర్యవెలుగు జాతీయ దినపత్రిక చీఫ్ ఎడిటర్ డి. ఖాజావలికి గుంతకల్లు పట్టణంలో ఘనంగా ఆత్మీయ సత్కారం నిర్వహించారు. యువశక్తి కంప్యూటర్ శిక్షణ సంస్థ డైరెక్టర్ యర్రగుంట జయన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఖాజావలిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జయన్న మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఉత్తమ జర్నలిస్టుగా గుర్తింపు పొందడం ఎంతో ఆనందంగా, గర్వకారణంగా ఉందన్నారు. సమాజంలోని సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ప్రజల కష్టాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ప్రజల గొంతుకగా నిలవడం జర్నలిస్టుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. అక్షరానికి గౌరవం లభించినప్పుడు, కలానికి తగిన గుర్తింపు వచ్చినప్పుడు సమాజంలో జర్నలిజం విలువ మరింత పెరుగుతుందని అన్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధత, నిర్భయత్వంతో పాటు సమాజం పట్ల బాధ్యత కలిగిన జర్నలిస్టులకు అవార్డులు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని తెలిపారు. డి. ఖాజావలి తన వృత్తిపట్ల చూపుతున్న అంకితభావం, నిరంతర కృషి, ప్రజా సమస్యలపై స్పందించే తీరు అభినందనీయమని కొనియాడారు. అవార్డులు కేవలం వ్యక్తిగత గౌరవానికి మాత్రమే కాకుండా, వారి సేవలకు సమాజం అందించే గుర్తింపునకు ప్రతీకలని అన్నారు. జర్నలిస్టుల కలం ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై ప్రశ్నించాలని, అన్యాయాన్ని ఎదిరిస్తూ సమాజ మార్పునకు దోహదపడాలని ఆకాంక్షించారు. అదేవిధంగా తాను నిర్వహిస్తున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు మీడియా అందిస్తున్న సహకారం, ప్రోత్సాహం మరువలేనిదని జయన్న పేర్కొన్నారు. ప్రజాసేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని అన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారం అందుకున్న డి. ఖాజావలి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్ కిషోర్, యువశక్తి సంస్థ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.