మహనీయుల సేవలు చిరస్మరణీయం: మధు యాష్కీ గౌడ్
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః దేశ చరిత్రలో నిలిచిపోయే రోజని ఏఐపీసీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానేతలను స్మరించుకునే రోజుగా ఈ తేదీకి ప్రత్యేకత ఉందన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరాగాంధీ సేవలను ఆయన స్మరించుకున్నారు. 'గరీబీ హటావో' నినాదంతో ఇందిరాగాంధీ పేదరిక నిర్మూలనకు కృషి చేశారని, బ్యాంకుల జాతీయీకరణతో పేదలకు ఆర్థిక అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ స్ఫూర్తితో పేదల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తోందన్నారు. మహనీయులను స్మరించుకునే విషయంలోనూ బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. దేశ నిర్మాణంలో మహానేతలు చేసిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని మధు యాష్కీ గౌడ్ పిలుపునిచ్చారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.