రాప్తాడు లో విద్యార్థి పై చేసిన దాడి ని తీవ్రంగా ఖండిస్తున్నాం… ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరసింహమూర్తి
హిందూపురం: - అనంతపురం జిల్లా రాప్తాడు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిపై చెట్లు కోసే రంపం తో దాడి చేసిన ఘటనను ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరసింహ మూర్తి తీవ్రంగా పండించారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులపై ఇలాంటి దాడులు జరగడం ఆందోళనకరం. విద్యార్థుల భద్రతకు పాఠశాలలు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని వెంటనే గుర్తించి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నాం. గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించడం తో పాటు, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని నరసింహమూర్తి డిమాండ్ చేశారు.
హిందూపురం సూర్య స్టాఫ్ రిపోర్టర్ నాగేంద్ర