BREAKING
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజాసేవ ముఖ్యం ఎన్నికల విధులు అత్యంత జాగ్రత్తతో నిర్వహించాలి నాన్న కోలగట్ల సేవలను గుర్తించి.. నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు చర్యలు చేపట్టాలి: ఎంపీడీవో అంజన్ రెడ్డి బద్వేల్ జర్నలిస్టు లకుఎలక్షన్ పాసులు మంజూరు మున్సిపల్ కమిషనర్ కృష్ణ . ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు... తెదేపా సీనియర్ నాయకులు వంగా గోవిందరావు మృతి పార్టీకి తీరని లోటు... ఎంఎల్ఏ " కోండ్రు " గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితుడు సిగిలి వెంకటేష్ పై పీడీ యాక్ట్.... * విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ * అదనపు ఎస్పీ (పరిపాలన) గా బాధ్యతలు చేపట్టిన పద్మలత వైఎస్ఆర్ కాంగ్రెస్ ను వీడి తెదేపా లోకి వలసలు ప్రజా తీర్పుతోనే నాయకత్వానికి గుర్తింపు: పోరెడ్డి టీ ఆర్ పి ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ-మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ బాలల రక్షణ పై అవగాహన కల్పించడమే సురక్షిత్ బచ్పన్ అభియాన్ లక్ష్యం - జిల్లా మెజిస్ట్రేట్. కూటమి ఎంపిక చేసిన జడ్పిటిసి ఎన్నికల్లో రేవతి దే విజయం విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వోల్లాల లచ్చన్న కన్నుమూత

అకాల వర్షంతో అన్నదాతల ఆగమాగం చేతికొచ్చిన పంట నేలపాలు.. రైతులకు తీరని నష్టం..!

Select Suryaa Now
అకాల వర్షంతో అన్నదాతల ఆగమాగం చేతికొచ్చిన పంట నేలపాలు..  రైతులకు తీరని నష్టం..!

సూర్య - వీణవంక :మండలంలోని పలు గ్రామాల్లో కురుస్తున్న అకాల వర్షాలు రైతన్నలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎన్నో రోజులుగా కష్టపడి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో వర్షం రూపంలో ప్రకృతి విరుచుకుపడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో కురుస్తున్న వర్షాలతో పొలాల్లో నీరు నిలిచిపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయి. ఇప్పటికే కోసి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
ఏడాది పొడవునా పెట్టుబడులు పెట్టి, కుటుంబ సభ్యులతో కలిసి శ్రమించి పండించిన పంట కళ్ల ముందే దెబ్బతింటుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని, సంబంధిత వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు.
పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కురవడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.