BREAKING
2029 నాటికి దేశాన్ని పూర్తి డ్రగ్స్ రహితంగా మారుస్తామని అమిత్ షా ప్రతిజ్ఞ యువజన వికాస్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 151 వ జయంతి వేడుకలు ప్రపంచ ఆర్మ్‌వ్రిస్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన భారత్ వెబ్ కాస్టింగ్ వీక్షణకు విస్తృత ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఉత్తర బెంగాల్‌ను వణికించనున్న 'అర్నాబ్' తుఫాను ప్రభావం దేశంలో ఒక బిలియన్ మందికిపైగా సామాజిక భద్రత బీహార్‌కు భారీ వర్ష సూచన.. సీతామఢీ, మధుబని జిల్లాలకు రెడ్ అలర్ట్ దీపావళి కానుకగా నందమూరి బాలకృష్ణ 'దాదా' ఫస్ట్ సింగిల్... ఫ్యాన్స్‌కు అదిరిపోయే మ్యూజికల్ ట్రీట్! ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం! అసోం పాడి, అగర్‌వుడ్ రైతులకు భారీ ఊరట పట్టా, ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా మట్టి రైతు మట్టిని నమ్ముకుంటే.. నాయకులు మట్టిని అమ్ముకుంటున్నారా? తవ్వకాలు! వారణాసి-దిల్లీ మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ విజయ్ సేతుపతి 'ట్రెయిన్' సినిమా విడుదల తేదీ ఖరారు... డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి! దేశవ్యాప్తంగా 490 మంది పోలీసు సిబ్బందికి 'కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్-2026' ప్రకటన దేశ ఐక్యత, సమగ్రత కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం – దోసకాయల వెంకటేష్

చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్‌గా మహేందర్ నందారి నియామకం

Select Suryaa Now
చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్‌గా మహేందర్ నందారి నియామకం

చేవెళ్ల: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) లీగల్, హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టీఐ విభాగం చేవెళ్ల నియోజకవర్గ లీగల్ సెల్ చైర్మన్‌గా అడ్వకేట్ మహేందర్ నందారిని నియమించింది. ఈ మేరకు టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ అడ్వకేట్ బి. యాది రెడ్డి అక్టోబర్ 30న నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా మహేందర్ నందారి చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పార్టీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నిరంతరం పనిచేయాలని నియామక పత్రంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి మహేందర్ నందారి కృతజ్ఞతలు తెలిపారు. లీగల్ సెల్ ద్వారా పార్టీకి, ప్రజలకు సేవలందిస్తూ చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.