BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలి: డాక్టర్ సుంకరి నిజం గెలిచింది ..రాష్ట్రం అభివృద్ధి బాట పట్టింది : టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ నేషనల్ హైవే అంశంపై రాజకీయ విమర్శలు మానుకోవాలి: బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కస్తూరి నాగరాజు ఉద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు చింతకుంటలో విషాదం.. ఇద్దరు కుమారులతో సహా తల్లి మృతి ఇందిరా గాంధీకి భట్టి, వాకిటి నివాళులు భీమా పథకాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలి "శ్రీ త్యాగరాయ ఆచార్య గీతా" (గీతా సంగీత సమన్వయ లహరి) ఇందిరా గాంధీకి మంత్రి పొన్నం నివాళులు ఖర్గే నివాసంలో ప్రజా అభిశంసన.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ‘ఇండియా’ కూటమి నిరసన NHM ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి.. ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలకు అండగా నిలవండి -ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఎన్ హెచ్ ఎం జేఏసీ బాధ్యుల హృదయపూర్వక విజ్ఞప్తి ఎన్నికల సిబ్బందికి తీపి కబురు: పారితోషికం పెంపు.. జీవోలు జారీ చేసిన ప్రభుత్వం ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి స్ఫూర్తిదాయకం ఇందిరా పాలన మొదటి శాకాహార పండ్ల మేత డైనాసర్‌గా 'హెల్ చికెన్' గుర్తింపు

వెబ్ కాస్టింగ్ వీక్షణకు విస్తృత ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

Select Suryaa Now
వెబ్ కాస్టింగ్ వీక్షణకు విస్తృత ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

ఒంగోలు, మేజర్‌న్యూస్‌ :

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ సరళిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ తోపాటు చీమకుర్తి, అద్దంకి మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రతి పోలింగ్ గదిలో సిసి టీవీలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఆయా కేంద్రాలలోని పరిస్థితిని నిశితంగా గమనించేలా కలెక్టర్ కార్యాలయానికి అనుసంధానం చేశారు. ఈ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు శనివారం పరిశీలించారు. కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి లైవ్ వెబ్ కాస్టింగ్ వీక్షించే సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేంద్రంలో 1077 టోల్ ఫ్రీ నంబర్ ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకునే సిబ్బందికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి ఏమైనా అభ్యర్థనలు, ఫిర్యాదులు వస్తే వెంటనే సంబంధిత ఆర్వోలకు సమాచారం అందించేలా ప్రత్యేక కమ్యూనికేషన్ హ్యాండ్ సెట్స్ కూడా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట కమాండ్ కంట్రోల్ కేంద్రం ఇన్చార్జి మాధురి, ఇతర అధికారులు ఉన్నారు.