ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి దేశ ఐక్యత, జాతీయ సమగ్రతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ ను అధికారులతో చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, డిఆర్ఓ స్రవంతి, ఏవో వర్ణ, జిల్లా అధికారులు మనోహర్, సునీత కుమారి, కలిం, రామరావు, కలెక్టరేట్ వివిధ విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది, న్యాయవాదులు, పాల్గొన్నారు.