ఇందిరా గాంధీకి మంత్రి పొన్నం నివాళులు
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః ఉక్కు మహిళ, భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని శక్తి స్థల్ వద్ద రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొని ఇందిరా గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశ ఐక్యత, సమగ్రత కోసం ఇందిరా గాంధీ చేసిన కృషిని, దేశం కోసం ఆమె చేసిన త్యాగాలను మంత్రి పొన్నం ప్రభాకర్ స్మరించుకున్నారు. ఇందిరా గాంధీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ పాలనను అందిస్తూ, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.