స్ఫూర్తిదాయకం ఇందిరా పాలన
సూర్య భోధ్ …దేశ సమగ్రతకు ఉక్కు కవచంలా నిలిచి పేదల సంక్షేమమే పాలనకు ప్రాధాన్యంగా భావించి భారత రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న భారతరత్న, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా బోథ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి, దేశానికి ఆమె చేసిన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ఇందిరాగాంధీ ఒక వ్యక్తి మాత్రమే కాదు ఒక శక్తి, ఒక స్ఫూర్తి, దేశ చరిత్రను మలిచిన ధైర్యానికి ప్రతీక అని కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రత, ఆత్మగౌరవం కోసం ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, పేదలు మరియు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషి తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగా రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పాసుల చంటి, జిల్లా జనరల్ సెక్రటరీ అబ్రార్, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెరుగు నర్సింహ దాస్, జనరల్ సెక్రటరీ అబూద్, మాజీ ఎంపీటీసీ షేక్, బోథ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆలపాటి అచ్యుతానంద్ రెడ్డి, మండల మైనారిటీ అధ్యక్షుడు షేక్ అలీమ్, ఆత్మ డైరెక్టర్ రహీముద్దీన్, వార్డు మెంబర్ షకీర్, సెక్రటరీ నీరజ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.