BREAKING
ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్ బొబ్బిలి మాజీఎమ్మెల్యే. .చంబంగివెంకట చిన్నప్ప నాయుడు పోలింగ్ లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలి : జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్..* శ్రీధర్ గాదె కొత్త సినిమా 'కొరివి' టైటిల్ గ్లింప్స్ విడుదల: ఈశ్వర్ రాచిరాజు హీరోగా విలేజ్ బ్యాక్ డ్రాప్ హారర్ మూవీ కన్నడ నటి రన్యారావుకు వీఐపీ ప్రొటోకాల్ దర‍్శనం: తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు క్రైస్తవ సమాజంలో సంస్కరణలు రావాలి - పల్లె శాంతిరాజ్ లక్ష ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న చలమల్ల కృష్ణారెడ్డి పేదల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నది కూటమి ప్రభుత్వమే. అట్టహాసంగా ముగిసిన 'మోహన మంత్ర'! విద్యార్థుల మేధస్సుకు పట్టం కట్టిన టెక్నో-కల్చరల్ ఫెస్ట్. అంగన్‌వాడి కేంద్రంలో పాము కలకలం.. కరువు మండలాలుగా ప్రకటించాలని కలెక్టర్ కు వినతి - మాజీ ఎమ్మెల్యే గడ్డి గారి విట్టల్ రెడ్డి. ### పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తున్న వారిని బర్తరఫ్ చేయాలి జనసేన మండల అధ్యక్షుడు అడపా నాగరాజుపై పార్టీ నాయకుల తీవ్ర ఆరోపణలు బొర్రంపాలెం సమావేశంలో పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ బంగ్లాదేశ్‌లో విజృంభిస్తోన్న డెంగ్యూ మహమ్మారి టిజిపిసిబిలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు తైపీ మేయర్‌కు ఘోర అవమానం.. ప్రైడ్ పరేడ్‌లో నిరసనల హోరు మళ్లీ ఆదరిస్తే శంబర మరింత అభివృద్ధి

"శ్రీ త్యాగరాయ ఆచార్య గీతా" (గీతా సంగీత సమన్వయ లహరి)

Select Suryaa Now
"శ్రీ త్యాగరాయ ఆచార్య గీతా" (గీతా సంగీత సమన్వయ లహరి)

విశాఖ కల్చరల్,  సూర్య : పిఠాపురం కాలనీ విశాఖ కళాభారతి లో నిన్న శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు జరిగిన సాంప్రదాయ వీణా వాద కార్యక్రమం చాలా అద్భుతం గా జరిగింది. వినూత్నం గా అద్వితీయం గా  గీతసారాంశం , త్యాగరాజ స్వామి కీర్తనలతో సమన్వయం చేస్తూ గీతా సారాంశం లోని పలుయోగాలను త్యాగరాజ కీర్తనల ద్వారా ఆరు వీణలతో ఐదుగురు గాత్ర విద్వాంసులతో సమన్వయం చేస్తూ అత్యంత మనోహరంగా నిర్వహించబడింది. ముందుగా కళాభారతి కార్యదర్శి  డాక్టర్ రాంబాబు, ఎస్ రామ్ గోపాల్, బి.ఆర్.కె.రాజు,  నేటి ప్రధాన కళాకారిణి శ్రీమతి పద్మా రవిశంకర్, డా.పేరాల, పంతుల నర్సింగరావు జ్యోతి ప్రకాశనం చేసి శుభారంభం చేశారు. ఇంతవరకు కళాభారతి అనేక కళలను కళాకారులను పోషిస్తూ వస్తున్నదని , ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి గీత సారాంశాన్ని గీతలో చెప్పిన ధర్మాన్ని త్యాగరాజ స్వామి కీర్తనల ద్వారా ప్రపంచానికి తెలియజేశారని అందుకే ఇలాంటి ప్రత్యేకంగా కార్యక్రమం ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమాల ద్వారా అనేక ధర్మబద్ధమైన సూచనలు తెలియజేయబడ్డాయని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీమతి పప్పు పద్మావతి వారి బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. నేటి యువత, జెన్ జీ తరం కూడా "భగవద్గీత" సారాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ,  నేటి  కళాకారులలో ఈ యువత ఉండడం చాలా ప్రశంసనీయమని వారికి ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని ఆశీర్వదించారు.

తర్వాత జరిగిన కార్యక్రమం " శ్రీ త్యాగ ఆచార్య గీత" లో ఆరు వీణలు, నలుగురు గాత్రం కళాకారిణులు తో,  శ్రీమతి పప్పు పద్మ రవిశంకర్ బహు చక్కని వివరణాత్మక వ్యాఖ్యానంతో రెండున్నర గంటల పాటు సాగిన ఈ కార్యక్రమం శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. ఈ గీత సంగీత సమన్వయ లహరి అత్యంత అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన భగవత్గీతలో అనేక యోగాలు ఉన్నాయి. సాంఖ్య యోగము, కర్మయోగము, జ్ఞాన యోగము,  కర్మ సన్యాస యోగము,  ధ్యాన యోగము, భక్తి యోగము  ఇలా అన్ని యోగాలను త్యాగరాజ స్వామి వారి కీర్తనలు కీర్తనలలో ఎలా అనునయించ బడ్డాయో , అత్యంత శ్రావ్య గానం తో, వీణల వాదనలతో, వయొలిన్ , మృదంగ,  ఘట వాయిద్య సహకారాలతో అద్భుతంగా ప్రదర్శించి ప్రతి ఒక్కరూ మెచ్చుకునేలా సాగింది ఈ కార్యక్రమం. జనరంజక తాళాలతో, కీర్తనలతో కార్యక్రమం  నిర్వహించి అందరి మన్ననలను పొందారు కళాకారులు. నర్సింగరావు కార్యక్రమం నిర్వహించగా డా.పేరాల బాలమురళి కార్యక్రమం సమీక్షించారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు "సంగీత కళాభారతి"  డా.పంతుల రమ, గోపాలరావు, లక్ష్మీ తదితరులు పాల్గొని ప్రశంసించారు.
కార్యక్రమం అనంతరం యధావిధిగా భోజన రూపేనా ప్రసాద వితరణ జరిగింది