BREAKING
ఏదో ఒక రోజు ‌మల్కాపూర్ స్వచ్ఛభారత్ ప్రధాని దృష్టికి వెళుతుంది ముఖ్యఅతిథిగా తూప్రాన్ డిఎల్పిఓ సాయిబాబా ఉప సర్పంచ్ స్వామి కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల్లో సర్వతోముఖాభివృద్ది జలదంకి లో జన ప్రభంజనం పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఏఎస్ పేటలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి హబీబ్ భాషా బెంగళూరు ఫైవ్‌స్టార్ హోటల్ పూల్‌లో అనుమానాస్పద రీతిలో జర్మన్, స్లోవాక్ జాతీయుల మృతి! పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండా పిరికిపందలా పారిపోయారు : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పరవాడ పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి వివాహ వేడుకలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు మాగుంట లేఔట్‌లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల నిశ్చితార్థ వేడుకకు హాజరైన శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం --పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ మలబార్ ఉద్యోగుల స్వచ్ఛ భారత్ పోలింగ్ సరళిని పరిశీలించిన తారక్ నాథ్ రెడ్డి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల చీరాల, రేపల్లెలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు చీరాలలో 72.69 శాతం.. రేపల్లెలో 69.65 శాతం పోలింగ్

ఖర్గే నివాసంలో ప్రజా అభిశంసన.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ‘ఇండియా’ కూటమి నిరసన

Select Suryaa Now
ఖర్గే నివాసంలో ప్రజా అభిశంసన.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ‘ఇండియా’ కూటమి నిరసన

 

న్యూఢిల్లీ (న్యూస్‌డెస్క్):దేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా 'ఇండియా' (INDIA) కూటమి నిరసన జ్వాలలను మరింత తీవ్రతరం చేసింది. అందులో భాగంగా ఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ప్రతిపక్షాలు శనివారం ప్రాతినిధ్య 'ప్రజా అభిశంసన' (Public Impeachment) కార్యక్రమాన్ని నిర్వహించాయి.

ఈ ప్రత్యేక కార్యక్రమానికి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షత వహించగా, ప్రతిపక్షాల నుంచి పలువురు కీలక నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో పాటు ఇండియా కూటమికి చెందిన ఇతర భాగస్వామ్య పక్షాల నాయకులు ఇందులో పాల్గొని తమ నిరసన తెలిపారు.

ఎన్నికల సంఘం తీరుపై, ముఖ్యంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు, ఓటర్ల జాబితా సవరణలు మరియు ఎన్నికల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవడానికే రాజ్యాంగబద్ధంగా ఈ 'ప్రజా అభిశంసన' కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు స్పష్టం చేశారు.