భీమా పథకాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలి
మక్కువ, సూర్య : కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందజేస్తున్న భీమా పథకాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోసుకొని, తమ కుటుంబ ఆర్థిక భద్రత దోహదపడాలని పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ ఏపిజి బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ ఎం నాగరాజు పిలుపునిచ్చారు. శనివారం నాడు పిఎంజెజెబివై పథకం కింద బాధిత కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అమలు చేస్తున్న పిఎంజెజెవై పథకాన్ని ప్రతి ఒక్క ఖాతాదారులు సద్వినియోగం చేసుకొని, తమ కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోషా చేకూర్చాలని ఆయన కోరారు. మండలంలో యర్రసామంతవలస గిరిజన గ్రామానికి చెందిన పాలసీదారు సుబ్బారావు ఇటీవల మృతిచెందారు. మృతుడు 436 రూపాయలతో మక్కువ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లో ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన పథకం కింద పాలసీ పొంది ఉన్నారు. పాలసీదారు మృతి చెందడంతో నామిననీ అయిన మృతిని భార్య సుజాత కు మక్కువ బ్రాంచ్ లో రెండు లక్ష రూపాయల భీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మృతి భార్య సుజాత మాట్లాడుతూ.. ఏపిజి బ్యాంకు ద్వారా ఖాతాదారులకు అందజేస్తున్న ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన పథకం తమ కుటుంబాన్నికి ఆర్థికంగా ఎంతో దోహద పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మక్కువ బ్రాంచ్ మేనేజర్ ఎం నాగరాజుతో పాటు బ్రాంచ్ సిబ్బంది కె వెంకటేష్ , ఎం శ్రీనివాస్, బంకురు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.